India, China border talks: సరిహద్దు వివాదంపై రేపు భారత్‌, చైనాల మధ్య 13వ విడత చర్చలు

India, China 13th round of talks: భారత్‌ , చైనాల మధ్య ఆదివారం 13వ విడత చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల (Commanders) మధ్య ఈ చర్చలు జరగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2021, 07:10 PM IST
  • సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలపై భారత్‌, చైనాల మధ్య రేపు సమావేశం
  • ఇరు దేశాల మధ్య జరగనున్న 13వ విడత చర్చలు
  • చైనా భూభాగంలోని మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద రేపు ఉదయం సమావేశం
India, China border talks: సరిహద్దు వివాదంపై రేపు భారత్‌, చైనాల మధ్య 13వ విడత చర్చలు

India, China to address military stand-off, hold 13th round of talks tomorrow: సరిహద్దుల్లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌ (India), చైనా (China) రేపు సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం 13వ విడత చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల (Commanders) మధ్య ఈ చర్చలు జరగుతాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) ( Line of Actual Control) (LAC) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య ఏర్పడిన సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించేందుకే ఈ చర్చలు సాగనున్నాయి. 

ఎల్‌ఏసీ(LAC) వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో (Moldo) బోర్డర్‌ పాయింట్‌ వద్ద రేపు ఉదయం 10.30 గంటలకు భారత్, చైనా సైనికాధికారులు సమావేశం అవుతారు. ఈ దఫా చర్చల్లో తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌, (Hot Springs) గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Also Read : China-Taiwan tensions: తైవాన్‌ను కచ్చితంగా తమ దేశంలో క‌లుపుకుంటామంటున్న చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్

తూర్పు లద్దాఖ్‌లో (East Ladakh) గత ఏడాది మే నుంచి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాలను మోహరించాయి. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్.. చైనాతో ఇప్పటికే 12 సార్లు చర్చలు చేపట్టింది. చివరిసారిగా ఈ ఏడాది జులైలో భారత్ సైనిక కమాండర్లు (Commanders) చైనా సైన్యం (China army) ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ చర్చల ద్వారా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఘర్షణకు అవకాశం ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. ఇక రేపటి చర్చల్లో హాట్‌స్ప్రింగ్స్‌తో పాటు గోగ్రా లోయ, దెమ్‌చోక్‌ల నుంచి బలగాల ఉపసంహరణపై భారత్‌ (India).. చైనాతో (China) చర్చించనుంది.

Also Read : Afghanistan: తాలిబన్లతో చర్చలు జరపనున్న అమెరికా, అది మాత్రం కుదరదంటున్న యూఎస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News