India Corona Cases Today: ఇండియా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,58,089 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 13,113 తక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా ధాటికి దేశంలో మరో 385 మంది మరణించారు.
మరోవైపు 1,51,740 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209 కు చేరింది.
దేశంలో కరోనా వ్యాప్తి
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,73,80,253 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,86,482 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 16,56,310 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,52,37,461 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 2,58,089 COVID cases (13,113 less than yesterday), 385 deaths, and 1,51,740 recoveries in the last 24 hours.
Active case: 16,56,341
Daily positivity rate: 119.65%Confirmed cases of Omicron: 8,209 pic.twitter.com/Fi345RsMuw
— ANI (@ANI) January 17, 2022
వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 66,21,395 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454 కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 19,40,944 మందికి వైరస్ సోకింది. 3,992 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 32,86,76,590 నమోదవ్వగా.. కరోనా మరణాలు 55,57,596కు చేరాయి.
Also Read: Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?
Also Read: Pandit Birju Maharaj: ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook