India Corona Vaccination: ఇండియాలో 42 కోట్లు దాటిన వ్యాక్సినేషన్

India Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నెమ్మది నెమ్మదిగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగుతుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఊపందుకుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2021, 10:01 AM IST
India Corona Vaccination: ఇండియాలో 42 కోట్లు దాటిన వ్యాక్సినేషన్

India Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నెమ్మది నెమ్మదిగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగుతుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఊపందుకుంది. 

కరోనా మహమ్మారి(Corona pandemic)నియంత్రణకై దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination Drive)కొద్దిరోజులుగా ఊపందుకుంది. ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధానంగా ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల ఉత్పత్తి సామర్ధ్యం క్రమక్రమంగా పెరుగుతోంది. ఫలితంగా వ్యాక్సిన్లు అందుబాటులో వస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 42 కోట్ల 78 లక్షల 82 వేల 261 మందికి వ్యాక్సిన్ అందింది. గత 24 గంటల్లో 42 లక్షల 67 వేల 799 వ్యాక్సిన్(Vaccine) డోసులు అందించారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 39 వేల కరోనా కేసులు నమోదు కాగా..35 వేలమంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 5 లక్షల 3 వేల 166 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.35 శాతంగా ఉంది. నెలరోజుల్నించి దేశంలో 50 వేలకు దిగువలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుత 4 లక్షల 8 వేల 977 కరోనా యాక్టివ్ కేసులుండగా..కరోనా పాజిటివ్ రేటు 2.40 శాతంగా ఉంది.

Also read: JEE Mains Exam 2021: దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News