JEE Mains Exam 2021: దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్ష

JEE Mains Exam 2021: దేశంలో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని ఇవాళ నిర్వహించనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2021, 09:24 AM IST
JEE Mains Exam 2021: దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్ష

JEE Mains Exam 2021: దేశంలో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని ఇవాళ నిర్వహించనున్నారు.

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ప్రతి యేటా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు(JEE Mains Exams2021) దేశవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని తిరిగి ఇవాళ్టి నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకూ నాలుగు రోజుల వరకూ రెండు సెషన్లుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రోటోకాల్ (Corona protocol)నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకున్నారు.సిబ్బంది, అభ్యర్ధులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఆధారంగానే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ విద్యాసంస్థల్లో ప్రవేశం ఉంటుంది. 

ప్రతి ఒక్క సిబ్బంది గ్లౌజ్ తొడుక్కోవల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్ని శానిటైజ్ చేస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు శానిటైజర్ తీసుకురావచ్చు.సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని పరీక్ష కేంద్రాల్లో అనుమతించరు.మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కాగా, రెండవ సెషన్ పరీక్ష మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. అభ్యర్ధులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అడ్మిట్ కార్డు, ఫోటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరి. 

Also read: Central Universities: దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు వైస్ ఛైన్సలర్ల నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - 
https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News