Corona Cases in India : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..98.07 శాతానికి చేరిన రికవరీ రేటు!

Coronavirus update: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మంది​కి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్ తో మరో 246 మంది మరణించారు. బుధవారం ఒక్క రోజే 19,808 మంది రికవరీ అయ్యారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 11:11 AM IST
  • దేశంలో కొత్తగా 18,987 కరోనా కేసులు
  • వైరస్ తో 246 మంది మృతి
  • 98.07 శాతానికి చేరిన రికవరీ రేటు
Corona Cases in India : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..98.07 శాతానికి చేరిన రికవరీ రేటు!

Covid cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు(Covid cases in India) తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. 

బుధవారం 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌(Coronavirus update)గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 19,808 మంది కరోనా(Covid) నుంచి కోలుకున్నాను. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా వైరస్ సోకగా.. వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది. 

Also read: Breaking news: క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం...ఢిల్లీ ఎయిమ్స్​లో చేరిక

వ్యాక్సిన్ పంపిణీలో తగ్గుదల
ప్రస్తుతం క్రియాశీల కేసులు(Active Cases) రెండు లక్షలకు చేరువలో కొనసాగుతున్నాయి. ఆ కేసుల సంఖ్య 2.06 లక్షలు(0.61 శాతం)గా ఉంది. నిన్న మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం టీకా డోసుల(Vaccination) పంపిణీలో కాస్త తగ్గుదల కనిపించింది. నిన్న 35.66 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 96.82 కోట్లకు చేరింది. 

వరల్డ్ వైడ్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,40,664 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 7,506 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,99,37,425కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,89,385కు పెరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News