Corona cases in India: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొద్దికాలంగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 20 వేల దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 8,81,379 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,514 మందికి వైరస్(Corona cases in India) పాజిటివ్‌గా తేలింది.
ముందురోజుతో పోల్చితే 2.4శాతం మేర కేసులు తగ్గాయి. అలాగే మార్చి ప్రారంభం నాటి స్థాయికి క్షీణించాయి. ఆదివారం 12,718 మంది కోలుకున్నారు. 251 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. గత ఏడాది ప్రారంభం నుంచి 3.42 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.36 కోట్ల మంది వైరస్ ను జయించారు. నిన్న ఒక్క కేరళ(Kerala) రాష్ట్రంలోనే 7,167 కేసులు.. 167 మరణాలు నమోదయ్యాయి.
Also read: PM Modi on National Unity Day: ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉంది - మోదీ
ప్రస్తుతం వైరస్(Covid-19 Update)తో బాధపడుతున్నవారి సంఖ్య 1,58,817కి తగ్గింది. దాంతో క్రియాశీల రేటు 0.46 శాతానికి చేరగా.. రికవరీ రేటు(Recovery Rate) 98.20 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 4,58,437 మంది(Covid Deaths) మృత్యుఒడికి చేరుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కేవలం 12,77,542 మంది మాత్రమే టీకా(Covid-19 Vaccination) వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 106 కోట్ల మార్కును దాటింది.
India reports 12,514 #COVID19 cases, 12,718 recoveries and 251 deaths in last 24 hours as per the Union Health Ministry
Case tally: 3,42,85,814
Active cases: 1,58,817 (lowest in 248 days)
Total recoveries: 3,36,68,560
Death toll: 4,58,437Total Vaccination: 1,06,31,24,205 pic.twitter.com/Kynh0GZ2gf
— ANI (@ANI) November 1, 2021
వరల్డ్ వైడ్..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల్లో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. తాజాగా 3,27,243 మందికి కరోనా (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 4,595 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,74,63,395కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,14,976కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి