India Corona Cases: దేశంలో రెండో రోజూ కూడా కరోనా కేసులు(Corona Cases in india) 20వేల దిగువనే వెలుగుచూడటం ఊరటనిచ్చే ఆంశం. మంగళవారం 14,09,825 మందికి కొవిడ్ పరీక్షలు(Covid tests) చేయగా.. 18,833 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. మంగళవారం 24,770 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా.. 3.31 కోట్ల(97.94 శాతం) మంది వైరస్‌ను జయించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
➡️ 18,833 New Cases reported in last 24 hours.
➡️ Less than 50,000 Daily New Cases reported for 101 continuous days. pic.twitter.com/pprwU5nwcv
— Ministry of Health (@MoHFW_INDIA) October 6, 2021
కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసులు(Active cases) మరింత క్షీణించి 2.5 లక్షల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం 2.46 లక్షల మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.73 శాతానికి తగ్గింది. అయితే కేసులు తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. నిన్న 278 మంది ప్రాణాలు(Covid Deaths) కోల్పోయారు. ఇప్పటివరకు 4,49,538 మంది కరోనా కాటుకు బలయ్యారని కేంద్రం తెలిపింది. దేశంలో నమోదవుతోన్న కేసులు, మరణాల్లో సగం కేరళ(Kerala) నుంచే వస్తున్నాయి.
Also read: Lakhimpur Kheri violence: 'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయండి'..యూపీ పోలీసులకు సిద్ధూ వార్నింగ్
యాక్టివ్ కేసులు 203 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో టీకా(Vaccination) కార్యక్రమం వేగంగా సాగుతోంది. మంగళవారం 59.48 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 92 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
#Unite2FightCorona#LargestVaccineDrive
➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage crosses the landmark of 92 Cr (92,17,65,405).
➡️ More than 59.48 Lakh doses administered in last 24 hours.https://t.co/7aQlf0hhln pic.twitter.com/JGIggiMILL
— Ministry of Health (@MoHFW_INDIA) October 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook