Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. దేశంలో వరుసగా నాలుగవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 528 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 49 మంది చనిపోయారు. తాజా మృతులతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 709కి పెరిగింది.
గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 17 వేల 709 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 43 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.46శాతంగా ఉంది. కొవిడ్ రోజువారి కొత్త కేసులు 20 వేలు దాటిపోవడం వైద్య శాఖ వర్గాలను కలవరపరుస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న మరో 25 లక్షల 59 వేల 709 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 199 కోట్ల 98 లక్షల 61 వేల 438మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆదివారంతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ 200 కోట్ల మార్క్ కు క్రాస్ చేయనుంది.
COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449
199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd
— ANI (@ANI) July 17, 2022
Read also: Ukraine Plane Crash: గ్రీస్ లో కూలిన ఉక్రెయిన్ కార్గో విమానం.. రసాయనాల పేలుడుతో పెను ముప్పు
Read also: Mangla Gauri Vrat 2022: జూలై 19న శ్రావణ మొదటి మంగళవారం.. మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసుకోండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook