Covid 19 Cases: నిన్నటి కన్నా తగ్గిన కేసులు... దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

India Covid 19 Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3805 కరోనా కేసులు నమోదవగా... గడిచిన 24 గంటల్లో కొత్తగా 3451 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 11:55 AM IST
  • కోవిడ్ కేసుల అప్‌డేట్స్
  • దేశంలో కొత్తగా 3451 కరోనా కేసులు
  • కరోనాతో మరో 40 మంది మృతి
Covid 19 Cases: నిన్నటి కన్నా తగ్గిన కేసులు... దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

India Covid 19 Cases: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3451 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,02,194కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5,24,064కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

శనివారంతో (మే 7) పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న 3805 కేసులు నమోదవగా... నిన్నటి కన్నా ఇవాళ 354 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 9 శాతం కేసులు తక్కువగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా ఉండగా... వీక్లీ పాజిటివిటీ రేటు 0.83 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన 40 మరణాల్లో 35 మరణాలు కేరళలోనే చోటు చేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 3,60,613 కోవిడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా... ఇప్పటివరకూ మొత్తం 84.06 కోట్ల కోవిడ్ శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 190.20 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇప్పటివరకూ 193.53 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందాయి. 

Also Read: Kajal Aggarwal: మదర్స్ డే రోజున తొలిసారి కొడుకు ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్... 

Also Read: Rahul Ramakrishna: కాబోయే భార్యకు ముద్దు... త్వరలో పెళ్లి... అర్జున్ రెడ్డి నటుడి ఫోటో వైరల్...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News