India Corona Update: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కేరళలో పరిస్థితి ఆందోళనకరం

India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. కేరళ పరిస్థితి కలవరం రేపుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2021, 01:28 PM IST
  • ఇండియాలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
  • గత 24 గంటల్లో 47 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • కేరళలో పరిస్థితి ఆందోళనకరం, రోజుకు 32 వేల కొత్త కేసులు
 India Corona Update: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కేరళలో పరిస్థితి ఆందోళనకరం

India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. కేరళ పరిస్థితి కలవరం రేపుతోంది.

దేశంలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)ఎంటర్ అవుతోందా లేదా పెరుగుతున్న కేసులు కోవిడ్ థర్డ్‌వేవ్‌కు సంకేతాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న అన్‌లాక్, ఆంక్షల సడలింపు కారణంగా కరోనా సంక్రమణ మరోసారి విస్తరిస్తోంది. దేశంలో స్కూల్స్, థియేటర్లు తెర్చుకోవడం, పెళ్లిళ్లు, సమావేశాలకు పరిమితి పెంచడం వంటి కారణాలతో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. అయితే అదే సమయంలో కరోనా థర్డ్‌వేవ్‌కు ఇది సంకేతమని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. 

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఓ దశలో రోజుకు 25 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 47 వేల 92 కొత్త కరోనా వైరస్ కేసులు(India Coronavirus Update)నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 28 లక్షల 57 వేల 937కు చేరుకోగా..గత 24 గంటల్లో 509 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 4 లక్షల 39 వేల 529 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 89 వేల 529 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక రికవరీ రేటు దేశంలో 97.48 శాతం కాగా, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 35 వేలమంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 3 కోట్ల 20 లక్షల 28 వేల 825 మంది కోలుకున్నారు. కేరళలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. కేరళలో(Kerala Coronavirus Update) గత 24 గంటల్లో 32 వేల 803 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు మహారాష్ట్రలో 4 వేల 456 కేసులు, తమిళనాడులో 1509 కేసులు, ఏపీలో 1186 కేసులు, కర్ణాటకలో 1159 కేసులు నమోదయ్యాయి.

Also read: Delhi Heavy Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం, ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News