Indian Railways: భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా భారీ ఎత్తున ఉచిత వైఫై సేవలు అందుబాటులో వస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ పెద్దఎత్తున ఉచిత వైఫై అందిస్తోంది.
ఇండియన్ రైల్వేస్ (Indian Railways) సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఉచిత వైఫై సేవలు దాదాపు 6 వేల స్టేషన్లలో అందుబాటులో వచ్చాయి. జార్ఘండ్‌లోని హజారిబాగ్ టౌన్‌లో ఉచిత వైఫై సేవలు అందించడం ద్వారా ఇండియన్ రైల్వేస్‌లో మొత్తం 6 వేల స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో వచ్చాయి. 2016లో ముంబై రైల్వే స్టేషన్‌లో మొట్టమొదటిసారిగా ఉచిత వైఫై సేవల సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్ పూర్ స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలందించడం ద్వారా 5 వేల మార్కు చేరుకుంది.
డిజిటల్ ఇండియా(Digital India)లో భాగంగా దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాలు (Free Wifi Facilities) కల్పిస్తున్నారు. తద్వారా గ్రామీణ పట్ణణ పౌరుల మధ్య డిజిటల్ అంతరమనేది తగ్గుతుంది. గ్రామాల్లో డిజిటల్ వ్యవస్థపై అవగాహన కూడా పెరుగుతుంది. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 6 వేల స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నాయి. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ..రైల్ టెల్ సహాయంతో స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాలు కల్పిస్తోంది.
Also read: Sputnik V Vaccine: సామర్ధ్యంలో స్పుట్నిక్ వి వ్యాక్సిన్‌ను మించింది లేదట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook