దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లు; ఏపీకి 18, తెలంగాణకు 9

దేశవ్యాప్తంగా 200కు పైగా కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహెయిన్ బుధవారం లోక్ సభలో వెల్లడించారు.

Last Updated : Aug 2, 2018, 01:46 PM IST
దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లు; ఏపీకి 18, తెలంగాణకు 9

దేశవ్యాప్తంగా 200కు పైగా కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహెయిన్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులో భాగంగా తెలంగాణలో 9, ఆంధ్ర ప్రదేశ్‌లో 18 రైల్వే లైన్లు ఏర్పాటు కానున్నాయి. బీహార్‌లో అత్యధికంగా 34 నూతన రైల్వే లైన్‌ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం, కొత్త రైల్వే లైన్‌ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం కొత్త  రైల్వే లైన్‌ ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నట్లు.. ప్రతి రాష్ట్రంలోనూ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్‌ల పూర్తి కోసం ఇంకా వివిధ శాఖల నుంచి అనుమతులు అవసరమని లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

రాష్ట్రాల వారీగా..

అస్సాం, నార్త్ ఈస్ట్ రీజియన్: 15, ఆంధ్రప్రదేశ్: 18, బీహార్: 34, ఛత్తీస్గఢ్: 8, ఢిల్లీ: 1, గుజరాత్: 4, హర్యానా: 7, హిమాచల్ ప్రదేశ్: 4, జమ్ము & కాశ్మీర్: 1, జార్ఖండ్: 14, కర్నాటక: 16, కేరళ: 2, మధ్యప్రదేశ్: 8, మహారాష్ట్ర: 12, ఒడిషా: 10, పంజాబ్: 6, రాజస్థాన్: 10, తెలంగాణ: 9, తమిళనాడు: 8, ఉత్తర ప్రదేశ్: 15, ఉత్తరాఖండ్: 3, పశ్చిమ బెంగాల్: 18

అటు మాచర్ల-నల్గొండ రైల్వే ప్రాజెక్టు లాభదాయకం కానందున ఇది సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్  గోయల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భద్రాచలం-కోవ్వూరు మార్గంలో సర్వే అలైన్ మెంట్ మార్చమని అన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద 21 గ్రీన్‌ కారిడార్‌లను నెలకొల్పనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. రైల్వే కోచ్‌లలో బయో టాయిలెట్స్‌ నిర్మించాలని యోచిస్తోంది.

Trending News