ఇండిగో వెబ్ చెక్-ఇన్ పాలసీపై దుమ్మెత్తిపోసిన నెటిజెన్స్.. క్లారిటీ ఇచ్చిన సంస్థ!

ఇండిగో వెబ్ చెక్-ఇన్ పాలసీపై దుమ్మెత్తిపోసిన నెటిజెన్స్.. క్లారిటీ ఇచ్చిన సంస్థ!

Last Updated : Nov 26, 2018, 09:21 PM IST
ఇండిగో వెబ్ చెక్-ఇన్ పాలసీపై దుమ్మెత్తిపోసిన నెటిజెన్స్.. క్లారిటీ ఇచ్చిన సంస్థ!

న్యూఢిల్లీ: విమాన ప్రయాణం అంటేనే మిగతా వాటితో పోల్చుకుంటే బాగా ఖరీదైంది. కన్వినియెన్స్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు అన్నీ కలిపి టికెట్ ధర తడిసి మోపెడవుతుంది. అలాంటిది వెబ్ చెక్-ఇన్ ప్రక్రియకు సైతం అదనంగా ఇంకొంత మొత్తం వసూలు చేస్తామంటే, ఇక ప్రయాణికులపై ఇంకెంత భారం పడుతుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు.. సరిగ్గా తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ చేసిన కొత్త వెబ్ చెక్-ఇన్ పాలసీ చూసిన ప్రయాణికులు సైతం ఇలాగే లెక్కలేసుకుని ఘొల్లుమన్నారు. తమ కొత్త పాలసీ ప్రకారం వెబ్ చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే, అదనంగా మరో రూ.800 వరకు సమర్పించుకోవాల్సిందేనని ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

వెబ్ చెక్-ఇన్ ప్రక్రియ అంటే.. టికెట్ బుక్ చేసుకున్న అనంతరం విమానంలో ప్రయాణికులు తమకు ఏ క్లాస్‌లో, ఏ సీటు కావాలి, ఏయే ఆహార పదార్థాలు కావాలి అనేటటువంటి వివరాలు నమోదు చేసుకునేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలు అందించే సౌకర్యం.  

ఈ ప్రకటన అనంతరం ఇండిగో విమానంలో వెబ్ చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్ ద్వారా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థతో పంచుకున్నాడు. విమానంలో సీటు ఎంచుకోనిదే వెబ్ చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి కాదు అని మెస్సెజ్ వస్తోందంటే.. కచ్చితంగా సీటు ఎంచుకోనిదే వెబ్ చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి కాదా అని సదరు ప్రయాణికుడు ట్విటర్ ద్వారా ఇండిగోను ప్రశ్నించాడు. దీంతో ప్రయాణికుడి సందేహంపై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్.. వెబ్ చెక్-ఇన్‌కి మాత్రమే అదనపు చార్జీలు వర్తిస్తాయని, ఒకవేళ విమానాశ్రయం కౌంటర్‌లో చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే అక్కడ ఎటువంటి ఛార్జీలు వర్తించవని స్పష్టంచేసింది. కాకపోతే వెబ్ చెక్-ఇన్‌ తరహాలో నచ్చిన సీటును ఎంపిక చేసుకునే అవకాశం విమానాశ్రయంలోని కౌంటర్ చెక్-ఇన్‌లో ఉండదు అని ఇండిగో తేల్చిచెప్పింది. 

Trending News