ఆపరేషన్ సముద్ర సేతు.. భారత్‌కు తిరిగొచ్చిన 698 మంది

లాక్‌డౌన్ కారణంగా లక్షలాది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కొద్దిమంది భారత్‌లో ఉండిపోయారు. కొన్ని రోజుల కిందట భారత ప్రభుత్వం రాకపోకలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.

Last Updated : May 10, 2020, 01:39 PM IST
ఆపరేషన్ సముద్ర సేతు.. భారత్‌కు తిరిగొచ్చిన 698 మంది

లాక్‌డౌన్ కారణంగా లక్షలాది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కొద్దిమంది భారత్‌లో ఉండిపోయారు. కొన్ని రోజుల కిందట భారత ప్రభుత్వం రాకపోకలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో వందే భారత్ మిషన్ పేరిట విదేశాలలో చిక్కుకుపోయిన మన వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.  AP COVID19 Cases: ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

ఈ క్రమంలో ఐఎన్ఎస్ జలాశ్వ అనే భారీ ఓడ కేరళలోని కొచ్చి తీరానికి చేరుకుంది. మాలే, మాల్దీవులలో తలదాచుకున్న 698 మంది స్వదేశీయులను ఈ ఓడ ద్వారా అధికారులు తిరిగి భారత్‌కు తీసుకొచ్చారు. ఇందులో 19 మంది గర్భిణులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.  Mothers Day 2020: అందమైన కోట్స్‌తో అమ్మకు విషెస్ తెలపండి

ఆపరేషన్ సముద్ర సేతు మిషన్ ద్వారా జల మార్గం ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్‌కు క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేటి ఉదయం కొచ్చిలోని హార్బర్‌కు ఐఎన్ఎస్ జలాశ్వ ఓడ 698 మందిని స్వదేశానికి చేర్చింది. వీరికి అధికారులు కేంద్రం మార్గనిర్దేశకాల ప్రకారం కోవిడ్19 పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..    
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News