Instagram Revenge Story: మాజీ ప్రియురాలిపై ఇలా పగ తీర్చుకున్నాడు

Ex-Boyfriend's Instagram Revenge Story: బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసిన మొబైల్ నెంబర్ గురించి ఆరా తీయగా.. అది ఆమె మాజీ ప్రియుడు వివేక్ దిగా తెలుసుకున్నారు. వాస్తవానికి గత నాలుగేళ్లుగా వివేక్‌కి, బాధితురాలికి మధ్య ప్రేమాయణం జరిగిన సంగతి వెలుగులోకి వచ్చింది కూడా అప్పుడే.

Written by - Pavan | Last Updated : Mar 5, 2023, 09:05 PM IST
Instagram Revenge Story: మాజీ ప్రియురాలిపై ఇలా పగ తీర్చుకున్నాడు

Ex-Boyfriend's Instagram Revenge Story: మైనార్టీ కూడా పూర్తి కాని టీనేజ్ వయస్సులోనే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. నాలుగేళ్లు కలిసి చట్టాపట్టాలేసుకుని షికార్లు చేశారు. ఎక్కడో తేడా వచ్చింది. రిలేషన్‌షిప్ బెడిసి కొట్టింది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఒకరికొకరు దూరమయ్యారు. అక్కడివరకు ప్రియురాలిపై ఉన్నంత ప్రేమ అంతా ఒక్కసారిగా ద్వేషంగా మారింది. తనని మోసం చేసిందనే భావనతో ఆమెపై కోపం పెంచుకున్న ప్రియుడు.. ఎలాగైనా ఆమెను, ఆమె కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేయాలని దుర్మార్గపు ఆలోచనలు మొదలుపెట్టాడు. ఆమెపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని స్కెచ్ వేశాడు. అందు కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో తన మాజీ ప్రియురాలి పేరిట ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ ఎకౌంట్ కోసం ఆమె తండ్రి ఫోటోను ఉపయోగించడం ద్వారా ఆ కుటుంబం మొత్తాన్ని ఇందులోకి లాగాలని అనుకున్నాడు. కానీ తాను తప్పు చేస్తున్నాను అని తెలుసుకోలేకపోయాడు. 

ఎక్స్ గాళ్ ఫ్రెండ్ పేరిట ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేసిన తరువాత ఆమె పేరిట ఆమె బంధువులకు అశ్లీలకరమైన మెసేజులు పంపడం మొదలుపెట్టాడు. అలా ఆమెకు కూడా కొన్ని అశ్లీలకరమైన మెసెజెస్ పంపించాడు. తన పేరిట తనకే వచ్చిన అసభ్యకరమైన మెసేజెస్ చూసి బిత్తరపోయిన ఆ యువతి.. ఇదే విషయాన్ని ఫిర్యాదు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసిన మొబైల్ నెంబర్ గురించి ఆరా తీయగా.. అది ఆమె మాజీ ప్రియుడు వివేక్ దిగా తెలుసుకున్నారు. వాస్తవానికి గత నాలుగేళ్లుగా వివేక్‌కి, బాధితురాలికి మధ్య ప్రేమాయణం జరిగిన సంగతి వెలుగులోకి వచ్చింది కూడా అప్పుడే. మాజీ ప్రియురాలిపై పగ సాధించేందుకు అతడు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ఆమె బంధువులకే అశ్లీలకరమైన సందేశాలు పంపించి వారిని ఇబ్బందులపాలు చేయడంతో పాటు వారి పరువు ప్రతిష్టలు దెబ్బ తీయాలనుకున్నాడు అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల వివేక్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు ఈ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి : Apple iPhone: డబ్బులు లేకున్నా ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు.. డెలివరీ బాయ్‌ని..

ఇది కూడా చదవండి : Fake CBI Officers: సీబీఐ ఆఫీసర్ల గెటప్‌లో తండ్రి, కొడుకు కలిసి 11 లక్షలు చోరీ.. అంతలోనే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News