Man Kills Delivery Agent For iphone: హాసన్: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐఫోన్ డెలివరి చేయడానికి వచ్చిన ఫ్లిప్‌కార్ట్ డెలివరి బాయ్‌ని ఆ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఐఫోన్ పేమెంట్, అన్‌బాక్సింగ్ చేసే విషయంలో ఫ్లిప్‌కార్ట్ డెలివరి బాయ్‌కి, కస్టమర్‌కి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ డెలివరి బాయ్‌పై ఆగ్రహం చెందిన కస్టమర్.. కత్తి తీసుకుని అతడిని పొడిచి చంపేశాడు. కర్ణాటకలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ది హిందూ ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం.. హేమంత్ దత్త అనే 20 ఏళ్ల యువకుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేశాడు. హేమంత్ దత్త ఆర్డర్ చేసిన ఐఫోన్ డెలివరీ చేసేందుకని అదే హాసన్ జిల్లా అర్సెకెరెలోని లక్ష్మిపురంనకు చెందిన మంజు నాయక్ వచ్చాడు. అయితే, ఆ సమయంలో హేమంత్ దత్త వద్ద డబ్బులు లేకపోగా.. తన ఫోన్‌ని అన్‌బాక్స్ చేయాల్సిందిగా పట్టుబట్టాడు. అందుకు మంజు నాయక్ అంగీకరించకపోవడంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చిన హేమంత్ దత్త.. అతడిని పొడిచి చంపేశాడు. మంజు నాయక్‌ని హతమార్చిన అనంతరం అతడి శవాన్ని ఓ బస్తాలో కుక్కి ఇంట్లోనే దాచిపెట్టాడు.
ఇదిలావుండగా.. మంజు నాయక్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు అర్సెకెరె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేపడుతూ.. ఎవరికైతే చివరిసారిగా ఆర్డర్ డెలివరి చేయడానికి వెళ్లాడో.. అతడి వద్దకే వచ్చారు. అంటే హేమంత్ దత్త వద్దకే అన్నమాట. కానీ అప్పటికే హేమంత్ దత్త తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో నేరం చేశాడు.
రెండు రోజుల పాటు మంజు నాయక్ శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టిన హేమంత్ దత్త.. ఆ తరువాత అతడి శవాన్ని తీసుకుని వెళ్లి రైలుపట్టాల వద్ద పడేసి తగలపెట్టాడు. పోలీసుల విచారణలో హేమంత్ దత్త తన నేరాన్ని అంగీకరించాడు. తన కోపమే తన శత్రువు అన్నచందంగా .. యాపిల్ ఐఫోన్ కోసం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతడిని హంతకుడిని చేసింది. అతడి చేతిలో పొట్టకూటి కోసం డెలివరి బాయ్‌గా మారిన ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook