ప్రతిపక్షాల దగ్గర బీజేపీని ఓడించే ఫార్ములా !

                                                           

Last Updated : Jun 1, 2018, 05:07 PM IST
ప్రతిపక్షాల దగ్గర బీజేపీని ఓడించే ఫార్ములా !

తాజాగా వచ్చిన  బై పోల్స్ ఫోల్స్ ఫలితాలతో కమలనాథులు కాస్త నిరాశలో ఉండగా కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీల్లో ఆశలు చిగురించాయి. ఈ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమవడంతో గెలుపు సాధించగలిగాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే  ప్రతిపక్షాలన్నీ ఏకమైతే చాలు అనే నిర్ణయానికి వచ్చాయి. ప్రతిపక్షాలు ఊహిస్తున్నట్లు ఇది సాధ్యపడుతుందా అనే ప్రశ్న మదిలో ఉత్పన్నమౌతుంది కదూ..  దీని సమాధానం రాబట్టాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే మరి .

ఐక్యమత్యమే మహాబలం
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఈ వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో  ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ గెలుపు సాధించడం గమనార్హం. బీహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో అక్కడ బీజేపీని మట్టికరిపించడంలో ప్రతిపక్షాలు సఫలమయ్యాయి. అనంతరం యూపీ ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల కలయిక అపూర్వ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ  సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం విశేషం. ఇటీవలే జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఇదే సీన్ రీపీట్ అయింది. అయితే ఇక్కడ ఎన్నికల ముందు ప్రతిపక్షాలన్నీ ఏకం కాకపోయినా.. ఫలితాల తర్వాత జరిగిన పొత్తు కారణంగా బీజేపీని అధికారంలోకి రాకుండా నిలవరించగలిరారు. ఈ విజయాలను స్పూర్తిగా తీసుకొని ఇటీవలి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై అద్భుత విజయాన్ని సాధించాయి.

ఒంటిరిగా వెళ్తే ఓటమి తప్పదా ?

ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ గెలుపు సాధించినట్లే.. ఒంటరిగా పోటీ చేసిన చోట్ల ఓడిపోతూ వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు.  గుజరాత్ ఎన్నికల్లో బీజీపీతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఢీకొంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మరోమారు ఆ రాష్ట్రంలో ఓటమి చవిచూసింది. మిత్రపక్షమైన ఎన్సీపీతో జత కట్టకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాయి.. ఫలితంగా బీజేపీ విజయం సాధించగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హిమచల్ ప్రదేశ్ లోనూ ప్రతిపక్షాలు ఐక్యత లేని కారణంగా బీజేపీ విజయాన్ని అడ్డకోలేకపోయారు.ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒంటిగా పోటీ చేసి బీజేపీని ఓడించడం అంత ఈజీ పని కాదని ఈ పరిణామాలతో ప్రతిపక్షాలు గ్రహించాయి.

ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమేనా ?

తాజా పరిణామాల నేపథ్యంతో ప్రతిపక్షాలు కళ్లు తెరినట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల వరకు జరిగే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఐక్యంగా ఉండాలనే అభిప్రాయానికి వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చొరవచూపుతుంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పటి నుంచే వ్యహాలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్సీతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే తమతో కలిసొచ్చే పార్టీలతో చెలిమి చేసి మహాకటమిగా ఏర్పాటు చేయలనే లక్ష్యంతో  కాంగ్రెస్ ముందుకు వెళ్లోంది. కాంగ్రెస్ తో వచ్చేదెవరో.. హ్యాండ్ ఇచ్చేదెరో భవిష్యత్తులో తేలుతుంది.

Trending News