Aditya L1 Mission: భూమికి దూరంగా, సూర్యునివైపుకు ఆదిత్య ఎల్1 ప్రయోగం

Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయం అందించిన ఉత్సాహంతో ప్రయోగించిన సూర్య యాన్ పయనం విజయవంతంగా కొనసాగుతోంది. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ కీలకమైన దశల్ని దాటుకుంటూ ముందుకు సాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2023, 10:13 AM IST
Aditya L1 Mission: భూమికి దూరంగా, సూర్యునివైపుకు ఆదిత్య ఎల్1 ప్రయోగం

Aditya L1 Mission: సూర్యునిపై పరిశోధనలకై ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భూ కక్ష్యను దాటుకుని సూర్యుని కక్ష్యవైపుకు ముందుకెళ్తోంది. 

ఆగస్టు 23 సాయంత్రం చంద్రయాన్ 3 విజయవంతమైన తరువాత సెప్టెంబర్ 2న పీఎస్ఎల్‌వి సి 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. సూర్యుడి దిశలో ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరు నుంచి ఆదిత్య ఎల్ 1 కక్ష్యను మరోసారి విజయవంతంగా పెంచారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 4 సార్లు భూ కక్ష్యను పెంచారు. తాజాగా 5వ సారి కక్ష్యను పంచి సూర్యుడి దిశగా ప్రవేశపెట్టారు. 

ఆదిత్య ఎల్ 1 కు అమర్చిన స్టెప్స్ అనే పరికరం ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించినట్టు ఇస్రో  ప్రకటించింది. భూమికి 50 వేల కిలోమీటర్ల దూరంలో సూపర్ థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ డేటాను నమోదు చేస్తోంది. సౌర వాతావరణాల్ని పూర్తి స్థాయిలో పరిశోధించడమే ఆదిత్య ఎల్ 1 లక్ష్యంగా ఉంది. సూర్యుని మంటలు, సౌర రేణువులతో పాటు సూర్యునిపై వాతావరణం ఎలా ఉందో గుర్తించేందుకు ఉపయోగపడతాయి. 

Also read: Old Parliament: 75 ఏళ్లుగా చారిత్రక ఘటనలు, సంచలన చట్టాలకు వేదికగా నిలిచిన పాత పార్లమెంట్ విశేషాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News