Lemon Scam: జైల్లో నిమ్మకాయల కుంభకోణం - అవాక్కయిన అధికార గణం..!

Lemon Scam in Kapurthala Jail: పంజాబ్‌లో విచిత్ర కుంభకోణం బయటపడింది. జైలులో ఎవరికీ తెలియకుండా సాగుతున్న బండారం బట్టబయలయ్యింది. ఈ వ్యవహారం అందరినీ విస్తుపోయేలా చేసింది. అధికారుల ఆకస్మిక తనిఖీలో ఊహించని విషయాలు అందరికీ తెలిసిపోయాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 05:51 PM IST
  • రూ.1000 కు కక్కుర్తి పడి అడ్డంగా దొరికిన వైనం
  • గోధుమపిండి కూడా పక్కదారి పట్టినట్లు అనుమానం
  • అవాక్కయిన అధికార గణం
Lemon Scam: జైల్లో నిమ్మకాయల కుంభకోణం - అవాక్కయిన అధికార గణం..!

Lemon Scam in Kapurthala Jail: పంజాబ్‌లో విచిత్ర కుంభకోణం బయటపడింది. జైలులో ఎవరికీ తెలియకుండా సాగుతున్న బండారం బట్టబయలయ్యింది. ఈ వ్యవహారం అందరినీ విస్తుపోయేలా చేసింది. అధికారుల ఆకస్మిక తనిఖీలో ఊహించని విషయాలు అందరికీ తెలిసిపోయాయి.

ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం పెరిగిపోతోంది. ఫలితంగా నిమ్మకాయలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో, నిమ్మకాయల ధరలు కూడా వేసవితో పాటు మండిపోతున్నాయి. దీనిని అవకాశంగా మలచుకున్న జైలు అధికారులు.. కక్కుర్తి బాట పట్టారు. నిమ్మకాయలు కొనకుండానే.. కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఉన్నతాధికారులకు అడ్డంగా బుక్కయిపోయారు. నిధుల దుర్వినియోగం కారణంగా ఓ అధికారి సస్పెండ్‌ అయిపోయాడు.

పంజాబ్‌లోని కపుర్తలా మోడ్రన్‌ జైలులో ఈ దందా బయటపడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మోడ్రన్‌ జైల్లో అక్రమాలు జరుగుతున్నట్లు కొద్దిరోజులుగా ఫిర్యాదులు రావడంతో అక్కడి జైళ్లశాఖ అడిషనల్‌ డీజీపీవీరేంద్రకుమార్‌.. ఈనెల 1వ తేదీన అధికారుల బృందాన్ని పంపించారు. ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన అధికారులు తొలుత రికార్డులను పరిశీలించారు. వాటిలో రూ.200 కిలో చొప్పున 50 కిలోల నిమ్మకాయలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తర్వాత ఖైదీలను కలిసి జైల్లో పరిస్థితుల గురించి, ఇస్తున్న ఆహారం గురించి ఆరా తీశారు. అయితే, తమకు భోజనంలో నిమ్మకాయలు ఇవ్వడం లేదని ఖైదీలు అధికారుల బృందానికి వెల్లడించారు. దీనిపై అడిషనల్ డీజీకి నివేదిక సమర్పించారు.

అయితే, నిమ్మకాయల కుంభకోణానికి తోడు జైల్లో మరిన్ని అంశాలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయని అధికారుల బృందం తేల్చింది. ఖైదీలకు నాసిరకం భోజనం పెడుతున్నారని, సరిపడా భోజనం పెట్టడం లేదని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, జైల్లో ఖైదీలకు ఇస్తున్న చపాతి 50 గ్రాములకంటే తక్కువ బరువు ఉంటోందని, దీనినిబట్టిచూస్తే.. గోధుమపిండి కూడా పక్కదారి పట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. కూరగాయల కొనుగోళ్లలోనూ అక్రమాలు గుర్తించినట్లు నివేదికలో చేర్చారు.

కపుర్తలా జైల్లో పరిస్థితులపై, అక్కడి జైలు అధికారుల వ్యవహారం గురించి తెలిసిన పంజాబ్‌ జైళ్ల శాఖ మంత్రి హర్‌జోత్‌ బియాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో జరుగుతున్న దందాలపై విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. జైలు సూపరింటెండెంట్‌ గుర్నామ్‌ లాల్‌ను సస్పెండ్‌ చేశారు.

Also Read: Vastu Tips: సింగిల్స్‌ కోసం వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

Also Read: Indrakaran Reddy: రాజకీయ లబ్ధి కోసమే యాదాద్రిపై దుష్ప్రచారం: ఇంద్రకరణ్‌రెడ్డి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News