Terror Attack: జమ్ములోని కథువా జిల్లాలో ఆర్మీ సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఆర్మీ వాహనంపై ఒక్కసారిగా దాడి జరపడంతో ఐదుగురు జవాన్లు హతమయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత కొద్దిరోజులుగా జమ్ము కశ్మీర్ లోయలో తీవ్రవాదులు వర్సెస్ ఆర్మీ జవాన్ల మధ్య చెదురుముదురు ఘటనలు, కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల్ని ఎన్ కౌంటర్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు కూడా మాటువేసి దాడులకు పాల్పడుతున్నారు. కధువా జిల్లాలోని మచెడి ప్రాంతంలోని కిండ్లీ-మర్హార్ రోడ్డులో ఆర్మీ వాహనాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంండలపై మాటువేసిన ఉగ్రవాదులు గ్రైనేడ్లతో దాడి చేశారు. వెనువెంటనే కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైన్యం కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చీకట్లో అడవుల్లోకి పారిపోయారు.
ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. రాజౌరీ జిల్లాలోని ఆర్మీ శిబిరంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఇక రెండ్రోజుల క్రితం శనివారం కుల్హాంలో ఉగ్రవాదులు, సైనికులకు మద్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ మరణించాడు.
కధువా దాడికి తామే బాధ్యులమని కశ్మీర్ టైగర్స్ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో ఎం4 ఎస్సాల్ట్ రైఫిల్స్ , గ్రైనేడ్లు ఉపయోగించినట్టు తెలిపింది. ఈ తరహా దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించింది. ఈ ఉగ్రదాడిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తీవ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook\