MLA Slaps Principal: క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ ను కొట్టిన ఎమ్మెల్యే.. మరీ ఇంత బరితెగింపా!

MLA Slaps Principal: అతనో ప్రజా ప్రతినిధి. గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అద్యాపకుడిపై దారుణంగా వ్యవహరించాడు. కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు

Written by - Srisailam | Last Updated : Jun 22, 2022, 06:16 PM IST
  • కర్ణాటకలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే
  • క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ పై దాడి
  • ఎమ్మెల్యే దాడి వీడియో వైరల్
MLA Slaps Principal: క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ ను కొట్టిన ఎమ్మెల్యే.. మరీ ఇంత బరితెగింపా!

MLA Slaps Principal: అతనో ప్రజా ప్రతినిధి. గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అద్యాపకుడిపై దారుణంగా వ్యవహరించాడు. కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. క్లాస్ రూమ్ లో పిల్లలంతా చూస్తుండగానే.. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువుపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.

వివరాల్లోకి వెళితే..  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో  జరిగింది. స్థానిక జనతాదళ్ జేడీఎస్ ఎమ్మెల్యే  శ్రీనివాస్ నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాళాశాలకు వెళ్లారు. కాలేజీలో తనిఖీలు చేశారు. కాలేజీలో నిర్మాణంలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరా తీశారు. పనుల పురోగతిపై కాలేజీ ప్రిన్సిపాల్ ను అడిగారు ఎమ్మెల్యే. అయితే వెంటనే ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తాను అడిగిన వివరాలు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ చెంప చెల్లుమనిపించారు. ఒక్కసారి కాదు నాలుగు సార్లు కొట్టారు ఎమ్మెల్యే శ్రీనివాస్.



ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే దాడి చేసిన సమయంలో కాలేజీ సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా అక్కడే ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ఘటనకు తీసుకెళ్లాయి అద్యాపక సంఘాలు. ఎమ్మెల్యే తీరుపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువు అనికూడా చూడకుండా అందరి ముందు ఎమ్మెల్యే దారి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనాలు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News