CM Jagan Tour: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మ ఒడి మూడో విడత నిధుల విడుదల అప్పుడే..!

CM Jagan Tour: ఏపీలో అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 27న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 22, 2022, 06:24 PM IST
  • అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీ
  • శ్రీకాకుళం జిల్లా నుంచి నిధుల జమ
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
CM Jagan Tour: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మ ఒడి మూడో విడత నిధుల విడుదల అప్పుడే..!

CM Jagan Tour: ఏపీలో అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 27న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈసందర్భంగా అమ్మ ఒడి  పథకం మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం-ఆమదాల వలస నాలుగు లైన్ల విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

సీఎం టూర్‌ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోవర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పరిశీలించారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం టూర్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈనెల 27న శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ముందుగా శ్రీకాకుళం-ఆమదాల వలస నాలుగు లైన్ల విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు.

అనంతరం భారీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అమ్మ ఒడి  పథకం మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఆ తర్వాత అమ్మ ఒడి లబ్ధిదారులతో మాట్లాడతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులతోనూ మమేకమవుతారు సీఎం. ఈసందర్భంగా సీఎం టూర్‌కు సక్సెస్ చేయాలని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌..కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Also read: AP Govt: ఏపీలో రైతులకు శుభవార్త..పంటల బీమా పరిహారం అందని వారికి మరోసారి ఛాన్స్..!

Also read:Maharashtra crisis: ప్రభుత్వాల కూల్చివేతల్లో బీజేపీ కొత్త రికార్డ్.. మహారాష్ట్ర తర్వాత రాజస్థానేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News