Viral: యువతిపై చేయి చేసుకున్న పోలీసుపై చర్యలకు సీఎం ఆదేశాలు

యువతిపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చేయి చేసుకుని, ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చిన పోలీసు అధికారి వీడియో వైరల్‌గా ( cop slapping girl )  మారింది.

Last Updated : Jul 28, 2020, 01:21 PM IST
Viral: యువతిపై చేయి చేసుకున్న పోలీసుపై చర్యలకు సీఎం ఆదేశాలు

రాంచి: యువతిపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చేయి చేసుకుని, ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చిన పోలీసు అధికారి వీడియో వైరల్‌గా ( cop slapping girl )  మారింది. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా బర్హైత్ పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ( Jharkhand CM Hemant Soren ) వరకు వెళ్లింది. వీడియో చూసి తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలిపిన సీఎం హేమంత్ సోరెన్.. ఈ తరహా ఘటనలు అసలు ఉపేక్షించేది లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా యువతిపై చేయి చేసుకున్న సదరు పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డీజీపీ ఎం.వి. రావును ఆదేశించారు. Also read: India: 33వేలు దాటిన కరోనా మరణాలు

CM Hemant Soren ఆదేశాలపై స్పందించిన జార్ఖండ్ డీజీపీ ఎంవి రావు.. మహిళపై చేయి చేసుకున్న పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రేపు సాయంత్రంలోగా పూర్తి నివేదిక అందించాల్సిందిగా సంబంధిత డీఎస్పీని ఆదేశించారు. మహిళకు పూర్తి భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించడం జరిగిందని.. నివేదిక రాగానే పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ ఎంవి రావు ( DGP MV Rao ) ముఖ్యమంత్రి సోరెన్‌కు బదులిచ్చారు. Also read: 47 Chinese apps: చైనాకు చెందిన మరో 47 క్లోన్ యాప్స్‌పై భారత్ నిషేధం

లవ్ మ్యారేజ్ ( Love marriage ) వ్యవహారంలో పోలీసు స్టేషన్‌కి వచ్చిన ఓ దళిత మహిళపై పోలీసు అధికారి చేయి చేసుకున్న వైనం జార్ఖండ్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

Trending News