Ayodhya: అయోధ్యలో రాముడికి ప్రాణ‌ప్ర‌తిష్ట‌.. 30 ఏళ్ల త‌ర్వాత మౌన వ్ర‌తం వీడ‌నున్న ఆ మ‌హిళ‌..

Saraswati Devi: శ్రీరాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకుంది శబరి. ఇది త్రేతాయుగం నాటి మాట. కానీ ఈ కలియుగంలో కూడా అంతటి భక్తి కలిగిన వారు ఉన్నారంటే  ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి వారిలో ఝార్ఖండ్‌కు చెందిన సరస్వతి దేవి ఒకరు.ఈమె అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 30 ఏళ్లు మౌన వ్రతం పాటించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 05:07 PM IST
Ayodhya: అయోధ్యలో రాముడికి ప్రాణ‌ప్ర‌తిష్ట‌.. 30 ఏళ్ల త‌ర్వాత మౌన వ్ర‌తం వీడ‌నున్న ఆ మ‌హిళ‌..

Inauguration Ceremony in Ayodhya: ఈ కలియుగంలో కూడా ఇలాంటి భక్తులు ఉన్నారంటే ఆశ్యర్యం కలగక మానదు. ఝార్ఖండ్‌ (Jharkhand)లోని ధనబాద్‌కు చెందిన 85 ఏళ్ల  సరస్వతి దేవి అగర్వాల్ కు శ్రీరాముడంటే ఎనలేని భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్య (Ayodhya)ను సందర్శించారు. అక్కడ మళ్లీ రామ మందిరం నిర్మించేంతవరకూ తాను మౌనవ్రతం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఆమెకు ఏం కావాలన్నా సైగలతో అడగటం మెుదలుపెట్టారు. అయితే రోజులో ఒక గంట మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 2020లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన ఆమె 24 గంటల మౌనవ్రతం పట్టినట్లు సరస్వతి దేవి కుటుంబ సభ్యులు వెల్లడించారు. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందింది. సోమ‌వార‌మే అయోధ్య‌కు బయల్దేరిన ఆమె.. రాములోరి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు ఆమె కుమారుడు 55 ఏళ్ల హ‌రే రామ్ అగ‌ర్వాల్ తెలిపారు. స్థానిక ప్రజలు సరస్వతి దేవిని ‘మౌనీమాత’గా పిలుస్తారు. 1986లో భ‌ర్త దేవ‌కీనంద‌న్ అగ‌ర్వాల్ మృతి త‌ర్వాత స‌ర‌స్వ‌తీ దేవి త‌న జీవితాన్ని రాముడికి అంకితం చేసిందని... ఎక్కువ సమయం యాత్రలకే కేటాయిస్తుందని హరేరామ్ తెలిపారు. 

Also Read: Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, గెస్ట్స్ లిస్ట్ వైరల్

అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ రామమందిరంలో 44 అడుగుల పొడవు, 9.5 అంగుళాల వ్యాసంతో ఉన్న 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని (Dhawaja Stambh) ప్రతిష్ఠించనున్నారు. దీనిని గుజరాత్ కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు, ఎక్కడెక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News