రైల్వే ఉద్యోగార్ధుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ ముంబై

రైల్వే విభాగంలో ఉద్యోగాలు కల్పించాలంటూ ముంబైలో విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు. విద్యార్థులు ముంబైలోని మతుంగ-ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ మార్గాల వద్ద రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రైల్వే ట్రాక్‌లపై విద్యార్థులు కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Last Updated : Mar 20, 2018, 04:06 PM IST
రైల్వే ఉద్యోగార్ధుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ ముంబై

ముంబై: రైల్వే విభాగంలో ఉద్యోగాలు కల్పించాలంటూ ముంబైలో విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు. విద్యార్థులు ముంబైలోని మతుంగ-ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ మార్గాల వద్ద రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రైల్వే ట్రాక్‌లపై విద్యార్థులు కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

విద్యార్థులు నిరసన బాట పట్టడంతో ముంబైలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కుర్లా నుంచి సిఎస్‌ఎంటి వరకూ రైళ్లను నిలిపివేశారు. ఇప్పటికే పరీక్షలు క్లియర్ చేశామని, సెంట్రల్ రైల్వేలో ఉపాధి కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్ పై నిరసన వ్యక్తం చేయకుండా ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్ళ  దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది.

ఉద్యోగార్ధుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు 60కి పైగా లోకల్‌ ట్రైన్స్‌లను రద్దు చేశారు. విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రైల్వేలు నిర్వహించిన పరీక్షలకు తాము హాజరైనా ఇప్పటివరకూ నియామకాలు చేపట్టలేదని ఆందోళనకు దిగిన ఉద్యోగార్ధులు పేర్కొన్నారు. ముంబయి సెం‍ట్రల్‌ లైన్‌ మీదుగా లోకల్‌ ట్రైన్స్‌లో రోజూ 40 నుంచి 42 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు.

 

Trending News