JOBS Notification: Indian Coast Guard, Armed Forcesలో భారీగా ఉద్యోగాల భర్తీ

JOBS Notification: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇదొక మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో పెద్దఎత్తున ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టుల వివరాలు, ఎంపిక ఇలా ఉండనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 14, 2021, 06:32 PM IST
JOBS Notification: Indian Coast Guard, Armed Forcesలో భారీగా ఉద్యోగాల భర్తీ

JOBS Notification: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇదొక మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో పెద్దఎత్తున ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టుల వివరాలు, ఎంపిక ఇలా ఉండనుంది.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు( Defence Ministry) చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు( Indian Coast Guard), ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ( Armed Forces) నావిక్, యాంత్రిక్ పోస్టులకు సంబంధించి జనరల్, డొమెస్టిక్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకై పురుష అభ్యర్ధుల్నించి దరఖాస్తుల కోరుతున్నారు. మొత్తం 350 పోస్టులు భర్తీ చేయనున్నారు.  20222 జనవరి బ్యాచ్ కోసం ఈ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది.

నావిక్ (Navik) జనరల్ డ్యూటీ విభాగంలో 260 పోస్టులు, డొమెస్టిక్ విభాగంలో 50 పోస్టులు ఖాళీలున్నాయి. అటు యాంత్రిక్ మెకానికల్ విభాగంలో 20, ఎలక్ట్రికల్ విభాగంలో 13, ఎలక్ట్రానిక్ విభాగంలో 7 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. నావిక్ జనరల్ డ్యూటీ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్ అంశాలతో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి..వయస్సు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2000వ సంవత్సరం ఫిబ్రవరి 1 కు 2004వ సంవత్సరం జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. 

ఇక నావిక్ డొమెస్టిక్ విభాగం కోసం గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండి..వయస్సు 18-22 ఏళ్ల మద్య ఉండాలి.  01-04-200 నుంచి 31-03-2004 మధ్య జన్మించి ఉండాలి.

యాంత్రిక్ (Yantrik) విభాగం కోసం గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమో ఉండాలి. వయస్సు 18-22 ఏళ్ల మధ్యలో అంటే 01-02-200 నుంచి 31-01-2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. తొలిదశలో సంబంధిత పోస్టుల్ని బట్టి 5 సెక్షన్లుగా రాత పరీక్ష ఉంటుంది. సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టు సిలబస్, పరీక్ష సమయం, ప్రశ్నల వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.

ఇక రెండవ దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ (Medical Test) ఉంటాయి. మూడవ దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీసు వెరిఫికేషన్ ఉంటాయి.  ఇక చివరిది నాలుగవ దశలో ఎడ్యుకేషన్ బోర్డ్ లేదా యూనివర్శిటీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్లను ఇండియన్ కోస్టు గార్డు (Indian Coast Guard) ముందుంచాలి. 

ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 2021 జూలై 2 నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. జూలై 16 చివరి తేదీగా ఉంది. https://joinindiancoastguard.cdac.in వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు చూడవచ్చు.

Also read: Zycov D First children vaccine: మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, చిన్నారుల తొలి వ్యాక్సిన్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News