కృష్ణ జింకల వేట కేసు నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ కు ఈ కేసులో బెయిల్ తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈరోజు విచారణకు సల్మాన్ డుమ్మా కొట్టడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఏప్రిల్ లో ఈ కేసుకు సంబంధించిన వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ రోజు విచారణ జరిగిన విచారణకు సల్మాన్ హాజరుకాలేదు. ఈ పరిణామంపై ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో సల్మాన్ ఖాన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆయన తరపు న్యాయవాదులకు సూచించింది. లేందంటే బెయిల్ ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఘాటుగా హెచ్చరించింది