నడిరోడ్డుపై దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ (Journalist shot Dead) బుధవారం ఉదయం మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. తన మేనకోడల్ని కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారని జర్నలిస్ట్ విక్రమ్ జోషి (Journalist Vikram Joshi Passes Away) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ జర్నలిస్టుపై దుండగులు కక్ష పెంచుకున్నారు. అతడిని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. AP కొత్త మంత్రుల శాఖలు ఇవే..!
ఈ క్రమంలో సోమవారం ఘజియాబాద్‌లోని విజయ్ నగర్ సమీపంలో కాపుకాసి ఒక్కసారిగా జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై దాడికి పాల్పడ్డారు. అంతలోనే ఓ నిందితుడు తుపాకీతో జర్నలిస్ట్(Journalist) తలపై కాల్పులు జరిపాడు. దీంతో విక్రమ్ జోషి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుమార్తెలతో కలిసి బైకుపై ఇంటికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఆయనను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడం, తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం ఉదయం జర్నలిస్ట్ కన్నుమూశాడు. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు
ఈ కేసులో ఇదివరకే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్
ఈ ఘటనపై జర్నలిస్ట్ సోదరుడు అంకిత్ జోషి మాట్లాడుతూ.. కొన్ని రోజుల కిందట మేనకోడల్ని కొందరు ఆకతాయిలు వేధించారు. దీన్ని నా సోదరుడు విక్రమ్ జోషి అడ్డుకున్నాడు. వారించినా నిందితులు వినడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ దుండగులు కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారంటూ వాపోయాడు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..