Supreme court: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం ఖరారు

Supreme court: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2021, 12:40 PM IST
Supreme court: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం ఖరారు

Supreme court: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ( Supreme court Chief Justice SA Bobde) ఏప్రిల్ 23వ  తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు ఖరారైంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం... జస్టిస్ ఎన్వీ రమణ...సుప్రీంకోర్టులో 48వ ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. తన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణను నియమించాల్సిందిగా కోరుతూ... ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే... ప్రతిపాదన పంపారు. దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ( Supreme Court new CJ justice nv ramana)..ఆగస్ట్ 26, 2022 వరకూ విధులు నిర్వహిస్తారు. ఇది వరకు 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ ఎన్వీ రమణ... ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్... కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవ, ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ సేవలందించారు. 2000 జూన్ 27న ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Ap High court) లో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు.

Also read: Karnataka: కోవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే బెంగళూరులో ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News