బీజేపీ పంచన చేరిన తర్వాత. . జ్యోతిరాదిత్య సింధియా. . కాంగ్రెస్ పార్టీపై తన గళం విప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి పని చేశానని చెప్పారు. ఐతే కాంగ్రెస్ పార్టీ గతంలో లేదన్నారు. ఇప్పుడున్న హస్తం పార్టీలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. ఇసుకాసురులు పెరిగిపోయారని విమర్శించారు. రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో దేశానికి సేవ చేశానని చెప్పుకున్నారు. ఐనప్పటికీ కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది నేతలు తన పనితీరును ప్రశ్నించారని విమర్శించారు.
Read Also: కమల దళంలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
హస్తం పార్టీ నేతల తీరుతో విసుగు చెందానని జ్యోతిరాదిత్య సింధియా చెప్పుకున్నారు. అందుకే 18 ఏళ్ల బంధాన్ని తెంచుకుని బీజేపీలో చేరినట్లు వివరించారు. మధ్యప్రదేశ్ ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సర్కారు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీలో చేరడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వారి ఇంటికి తనను ఆహ్వానించి .. అందులో చోటు కల్పించారని తెలిపారు. బీజేపీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఓ కార్యకర్తలా సేవ చేస్తానని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..