Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?

kanwar yatra name plate controversy: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 21, 2024, 12:36 PM IST
  • వివాదంగా మారిన కన్వర్ యాత్ర నిబంధనలు..
  • వెంటనే ఆదేశాలు వెనక్కు తీసుకొవాలంటున్న అపోసిషనే నేతలు..
Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?

Kangana Ranaut fires on real hero sonu sood over kanwar yatra: ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పదిహేను రోజులపాటు కన్వర్ యాత్రను శివ భక్తులు చేస్తుంటారు. ఇక రేపటి నుంచి జులై 22 నుంచి ఇది జరగనుంది. దీనిలో భాగంగా పవిత్రమైన గంగానదుల నుంచి జలాలను సేకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రలు జరిగే ప్రాంతంలో ఉండే దుకాణాదారులు తమ స్టాల్ ముందు పేర్లు, మొబైల్ నెంబర్ ల బోర్డులు పెట్టుకొవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. దీనిపై స్థానికులు, దుకాణాదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త పొలిటికల్ టర్నతీసుకుంది. ఒక వర్గం వారిని, ఇబ్బందులు పెట్టేందుకు యోగి ప్రభుత్వం ఇలాంటి రూల్స్ తీసుకొచ్చిందంటూ కాంగ్రెస్, మిగత అపోసిషన్ నాయకులు విమర్శిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో రియల్ హీరో సోనూసూద్ తాజాగా, కన్వర్ యాత్ర వివాదంలో ట్విట్ లు చేయడం మరో రచ్చగా మారింది. దుకాణాల ముందు నెమ్ బోర్డులకు బదులుగా, మానవత్వం అనే బోర్డులు పెట్టాలని ఎక్స్ వేదికగా ట్విట్ లు చేశారు. దీనికి కౌంటర్ గా నెటిజన్లు.. ఒక దుకాణదారుడు.. చపాతీమీద ఉమ్మి వేసి, కస్టమర్లకు ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. దీంతో సోనూఈ ఘటనను , శబరిమాతతో పోల్చారు. ఎంగిలి తింటే ఏమౌతుందని వితండవాదం చేశారు. ఇది వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే... దీనిపై మండి ఎంపీ కంగానా కూడా రంగంలోకి దిగి సోనూసూద్ ను ట్విటర్ లో ఏకీ పారేశారు.

సోనూసూద్ ట్విట్ ను అంగీకరిస్తామని అంటూనే.. హలాల్ స్థానంలో మానవత్వం అని కూడా బోర్డులు పెట్టాలని పంచ్ లు వేశారు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కన్వర్ యాత్రం నేపథ్యంలో.. మధ్య ప్రదేశ్ సర్కారు కూడా యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలనే ఫాలో అయ్యింది. తోపుడు బండ్లు, స్టాల్స్, హోటల్స్ లు తప్పనిసరిగా పేర్లు, మొబైల్ పేర్లతో ఉన్న బోర్డులు పెట్టుకొవాలని లేకుండా.. జరిమాన విధిస్తామని కూడా తెల్చి చెప్పింది. 

Read more:king Cobra: వామ్మో.. చెట్టు మీద 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మాత్రం హడలెత్తిపోతారు..

ఇదిలా ఉండగా..  కన్వర్ యాత్రకు పెట్టిన నిబంధనలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దీన్ని తప్పుపట్టారు.మజ్లీస్ నేత అసదుద్దీన్ సైతం దీన్ని ఖండించారు. ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News