నేటి నుంచి కర్ణాటకలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Last Updated : May 1, 2018, 01:37 PM IST
నేటి నుంచి కర్ణాటకలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వరుసగా ఎనిమిదో తేదీ వరకు రోడ్ షో, సభలలో మోదీ పాల్గొంటారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చామరాజనగర పట్టణంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆతరువాత మధ్యాహ్నం మూడు గంటలకు ఉడుపి కళాశాల మైదానంలో, ఉడుపి, కార్వార, భట్కళ, కుమట, విధానసభ స్థానాలకు సంబంధించి,సాయంత్రం బెళగావి జిల్లా చిక్కోడిలో బెళగావి విభాగ కార్యకర్తల సమావేశాల్లో ప్రసంగిస్తారు.

ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యుల్ వివరాలు:

  • మే 3న ఉదయం 11 గంటలకు కలబురగిలో, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బళ్లారిలో, సాయంత్రం 6 గంటలకు బెంగళూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
  • మే 5న ఉదయం 11 గంటలకు తుమకూరులో తుమకూరు, నెలమంగళ, హాసన్ పరిధిలోని కార్యకర్తలను ఉద్దేశించి..మధ్యాహ్నం 3 గంటలకు శివమొగ్గ, సాయంత్రం ఆరు గంటలకు గదగ్‌లో కార్యకర్తల సమావేశాల్లో ప్రసంగిస్తారు.
  • మే 7న ఉదయం 11 గంటలకు రాయచూరు, మధ్యాహ్నం మూడు గంటలకు చిత్రదుర్గ, సాయంత్రం ఆరు గంటలకు కోలారులో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • మే 8న ఉదయం 11 గంటలకు విజయపుర, మధ్యాహ్నం మూడు గంటలకు మంగళూరు, సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో కార్యకర్తల సమావేశాల్లో ప్రసంగించనున్నారు.  

 

Trending News