రైతులకు సీఎం కుమారస్వామి చెప్పిన ఫస్ట్ గుడ్ న్యూస్

Last Updated : May 24, 2018, 12:41 AM IST
రైతులకు సీఎం కుమారస్వామి చెప్పిన ఫస్ట్ గుడ్ న్యూస్

కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. కర్ణాటక రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్టుగానే రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కర్ణాటకలో 104 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీ అవతరించిన బీజేపీ తరుపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప సైతం మొదటిగా ఇదే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, మెజార్టీని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ నేత యడ్యూరప్ప విఫలమైన కారణంగా ఆయన చేసిన రైతు రుణాల మాఫీ ప్రకటన అధికారిక ఉత్తర్వులుగా వెలువడలేదు. అంతకన్నా ముందే బల పరీక్షకు వెనకడుగు వేస్తూ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకోవడంతో 116 మంది ఎమ్మెల్యేల మద్దతు వున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగుమమైంది. 

నేటి రాజకీయాల్లో దీనిని ఓ అతిపెద్ద పరిణామంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్న ముఖ్యమంత్రి కుమారస్వామి... కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు నూతనంగా ఏర్పాటుకానున్న ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు అని ధీమా వ్యక్తంచేశారు. ఏకైక పార్టీ ప్రభుత్వాలనున్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో అత్యుత్తమ పాలన అందించడానికి తాము సిద్దంగా ఉన్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం విభేదాలు లేకుండా కలిసి పని చేసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సిద్ధంగా వుంది అని కుమారస్వామి తెలిపారు. 

Trending News