కర్ణాటక ఎన్నికలు 2018: గుళ్లూ, గోపురాలు సందర్శిస్తున్న రాజకీయ నాయకులు

కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని బిజెపి, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు, ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలోనే వివిధ దేవాలయాలు, మఠాలు సందర్శించడం ప్రారంభించారు. ఆ విశేషాలు మీకోసం.

Last Updated : May 12, 2018, 12:08 PM IST
కర్ణాటక ఎన్నికలు 2018: గుళ్లూ, గోపురాలు సందర్శిస్తున్న రాజకీయ నాయకులు

కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని బిజెపి, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు, ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలోనే వివిధ దేవాలయాలు, మఠాలు సందర్శించడం ప్రారంభించారు. ఆ విశేషాలు మీకోసం.

శనివారం ఉదయం 7 గంటలకు కర్ణాటక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 224 సీట్లలో 222 సీట్లకుగాను ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుండి రాష్ట్రంలో  పోలింగ్ బూత్‌ల వద్ద ఓట్లు వేయడానికి ప్రజలు బారులు తీరి ఉన్నారు. ఈ వేసవి సీజన్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. (ఫోటో క్రెడిట్: పిటిఐ)

బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బి.ఎస్. యడ్యూరప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవ్వడానికి ముందు తన ఇంటిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత షికర్ పూర్ ఆలయం వద్దకు కూడా వెళ్లి పూజలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. "ప్రజలు సిద్దరామయ్య ప్రభుత్వంతో విసుగు చెందారు. నేనైతే ప్రజల కోసం పనిచేసే మనిషిని. అందుకే బిజెపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక ప్రజలకు మా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది" అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు

అలాగే బాదల్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములు కూడా పూజలు చేశారు. అలాగే గోవులకు ప్రత్యేక పూజలు చేశారు

అలాగే జయనగర్‌లో జేడీఎస్ నాయకుడు హెచ్ డి కుమార్ స్వామి గిరి ఆరామం మహాస్వామిని కలిశారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి కుమారస్వామి రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. 

Trending News