BS Yediyurappa's Helicopter: మాజీ సీఎంకి తృటిలో తప్పిన హెలీక్యాప్టర్‌ ప్రమాదం

BS Yediyurappa's Helicopter Landing Issue: దాదాపు ల్యాండింగ్ అయ్యేందుకు హెలీప్యాడ్ మీదకు వచ్చిన హెలీక్యాప్టర్.. నేల నుంచి కొద్ది ఎత్తులో ఉండగానే పైలట్ తిరిగి ఎత్తులోకి తీసుకువెళ్లాడు. అనంతరం హెలీక్యాప్టర్ అదే ప్రదేశంలో చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతుండగా.. కింద ఉన్న భద్రతా సిబ్బంది స్థానికుల సహాయంతో ప్లాస్టిక్ వేస్టేజ్ ని తొలగించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 04:48 PM IST
BS Yediyurappa's Helicopter: మాజీ సీఎంకి తృటిలో తప్పిన హెలీక్యాప్టర్‌ ప్రమాదం

BS Yediyurappa's Helicopter Landing Issue: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. నేడు బెంగళూరు నుంచి బిఎస్ యడియూరప్ప హెలీక్యాప్టర్ లో కాలబుర్గి వెళ్లారు.  బిఎస్ యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ కాలాబుర్గి చేరుకుని హెలీప్యాడ్ వద్ద ల్యాండింగ్ అవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. హెలీక్యాప్టర్ రెక్కల గాలి తాకిడికి హెలీప్యాడ్ చుట్టూ పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. హెలీక్యాప్టర్ ని సమానంగా పెద్ద పెద్ద కవర్లు గాల్లోకి లేవడం గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. 

 

దాదాపు ల్యాండింగ్ అయ్యేందుకు హెలీప్యాడ్ మీదకు వచ్చిన హెలీక్యాప్టర్.. నేల నుంచి కొద్ది ఎత్తులో ఉండగానే పైలట్ తిరిగి ఎత్తులోకి తీసుకువెళ్లాడు. అనంతరం హెలీక్యాప్టర్ అదే ప్రదేశంలో చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతుండగా.. కింద ఉన్న భద్రతా సిబ్బంది స్థానికుల సహాయంతో హెలీప్యాడ్ చుట్టూ పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ వేస్టేజ్ ని తొలగించారు. అనంతరం పైలట్ హోలిక్యాప్టర్ ని సురక్షితంగా కిందకు దించాడు. లేదంటే ప్లాస్టిక్ కవర్లు హెలీక్యాప్టర్ రెక్కలకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఆ ప్రమాదాన్ని నివారించడానికే పైలట్ ఈ పనిచేసినట్టు యడియూరప్ప భద్రతా సిబ్బంది తెలిపారు.

బిఎస్ యడియూరప్పకు కర్ణాటకలో మాస్ లీడర్‌గా పేరుంది. దీంతో యడియూరప్ప చాపర్ ల్యాండింగ్ కి అవాంతరాలు ఎదురయ్యాయని తెలియగానే ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, తరువాత యడియూరప్ప చాపర్ సురక్షితంగా కిందకు దిగిందని తెలిశాకా అందరూ హామ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.  

ఇది కూడా చదవండి : Kisan Credit Cards: సెక్యురిటీ లేకుండా రైతులకు రుణం ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్

ఇది కూడా చదవండి : Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News