Kisan Credit Cards: సెక్యురిటీ లేకుండా రైతులకు రుణం ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్

Kisan Credit Cards Benefits: కిసాన్ క్రెడిట్ కార్డు ఒకసారి జారీ చేస్తే.. 3 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పొందిన క్రెడిట్‌ని.. పంట చేతికొచ్చాకా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వారికి రూ. 1.60 లక్షలు వరకు ఎలాంటి కొలేటరల్ సెక్యురిటీ లేకుండా రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Written by - Pavan | Last Updated : Mar 5, 2023, 05:03 AM IST
Kisan Credit Cards: సెక్యురిటీ లేకుండా రైతులకు రుణం ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్

Kisan Credit Cards Benefits : కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రైతుల ఆర్థిక అవసరాలు, పెట్టుబడుల కోసం కేంద్రం తీసుకొచ్చిన సౌకర్యాల్లో ఒకటి. 1998లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఈ కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. వ్యవసాయం, మత్స్యసాగు, పాడి పరిశ్రమలో కొనసాగే రైతులకు స్వల్ప కాల పరిమితితో రుణాలు పొందేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. రైతులకు పెట్టుబడి కోసం అవసరమైన రుణాలు పొందడంలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

కిసాన్ క్రెడిట్ కార్డు ఒకసారి జారీ చేస్తే.. 3 ఏళ్ల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పొందిన క్రెడిట్‌ మొత్తాన్ని.. పంట చేతికొచ్చాకా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వారికి రూ. 1.60 లక్షలు వరకు ఎలాంటి కొలేటరల్ సెక్యురిటీ లేకుండా రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డుతో కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా.. కిసాన్ క్రెడిట్ కార్డుదారులైన రైతులకు దురదృష్టవశాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం బారినపడినా.. లేదా మృతి చెందినా.. వారికి రూ. 50 వేల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. శాశ్వత వైకల్యం కాకుండా ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి రూ. 25 వేల వరకు కవర్ వర్తిస్తుంది. 

కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అందించే బ్యాంకులు వివరాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి షెడ్యూల్డ్ బ్యాంక్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందిస్తున్నాయి. 

కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హతలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే రైతు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు మధ్య వారు అయి ఉండాలి. అలాగే సొంత భూమిలో వ్యవసాయం చేసే వారు అయి ఉండాలి.

సొంత భూమి కలిగిన రైతులు ఒక సమూహంగా ఏర్పడి కూడా జాయింట్ బారోవర్స్ గా కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు. కౌలుదారులు కూడా తగిన పత్రాలను ఆధారంగా చూపిస్తూ కిసాన్ క్రెడిట్ కార్డులు పొందడానికి వీలుంది. వ్యవసాయంతో అనుబంధం ఉన్న స్వయం సహాయక బృందాలు కూడా ఇందుకు అర్హులే. మత్ససాగు చేసే వారు, పాడి పరిశ్రమ చేసే వారు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి వీలుంది.

దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే..  రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటూ.. వారి ఫోటో ఐడెంటిటి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా ఏదైనా ఐడి కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?

ఇది కూడా చదవండి : Apple iPhone 15: యాపిల్ ఐఫోన్ 15 డిజైన్ లీక్.. ఊరిస్తున్న ఫీచర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News