Karnataka: కరోనా సెకండ్ వేవ్ కాదు..ఇప్పుడు మ్యూటేషన్ చెందిన వైరస్ భయపెడుతోంది. దేశంలోని 11 రాష్ట్రాల్లో విస్తరించిన ఆ వేరియంట్..3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఆ రాష్ట్రాల్నించి వస్తే మాత్రం కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో కరోనా మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ వైరస్ ఇప్పుడు మరింతగా భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కాస్తా డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందడమే దీనికి కారణం. యూకే, అమెరికా తరువాత ఇప్పుడు ఇండియాలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 48 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులున్నాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus Variant)హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను నియంత్రించేందుకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్నించి వచ్చేవారిపై నిబంధనలు పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్నించి వచ్చేవారు కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఆదేశించారు. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై యడ్యూరప్ప(Yedyurappa)..అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ప్రస్తుతానికి కర్ణాటకలో(Karnataka) అంతగా ప్రభావం లేదు. కేవలం ఒక్క కేసే ఇప్పటివరకూ నమోదైంది. అయినా సరే గట్టి నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పౌష్ఠికాహారం లోపమున్న పిల్లలపై దృష్టి సారించి..అవసరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. కళ్యాణమండపాలు, హోటళ్లు, పార్టీ హాల్స్, రిసార్టుల్లో 40 మందికి మించకుండా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
Also read: Vaccine for Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై వీడని అస్పష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook