Girlfriend in trolly Bag : గర్ల్‌ఫ్రెండ్‌ను ట్రాలీ బ్యాగ్‌లో తీసుకొచ్చి ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు.. ప్లాన్ ప్లాప్‌!

Girlfriend in trolly Bag at Manipal: ప్రియురాలితో రూమ్‌లో నైట్‌ మొత్తం ఎంజాయ్‌ చేయాలనుకున్న ఆ అబ్బాయి.. పెద్ద ప్లానే వేసి తన ప్రేయసిని గదికి తీసుకురావాలనుకున్నాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 02:59 PM IST
  • కర్ణాటకలోని మణిపాల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్
  • ప్రియురాలితో హాస్టల్‌లో నైట్‌ ఎంజాయ్‌ చేయాలనుకున్న అబ్బాయి
  • ట్రాలీ బ్యాగ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చిన స్టూడెంట్
  • వార్డెన్‌ కనిపెట్టడంతో ప్లాన్‌ మొత్తం ప్లాప్‌
Girlfriend in trolly Bag : గర్ల్‌ఫ్రెండ్‌ను ట్రాలీ బ్యాగ్‌లో తీసుకొచ్చి ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు.. ప్లాన్ ప్లాప్‌!

Student takes his Girlfriend to Hostel: కర్ణాటకలోని మణిపాల్‌లో ఒక హాస్టల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. తాజాగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మణిపాల్‌లో ఇంజినీరింగ్‌ చదువుతోన్న ఒక స్టూడెంట్.. (Student) తన కాలేజీలో చదువుతోన్న ఒక అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. 
తన గర్ల్‌ఫ్రెండ్‌ను (Girlfriend) రాత్రి తన హాస్టల్‌ రూమ్‌కు (Hostel Room) తీసుకురావాలని ప్లాన్ వేశాడు ఆ స్టూడెంట్.

ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్‌లో (Trolly Bag) గర్ల్‌ఫ్రెండ్‌ను కుక్కి హాస్టల్‌ తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. ఇక ఏమీ తెలియనట్లుగా హాస్టల్‌లోకి ట్రాలీ బ్యాగ్‌తో వస్తోన్న ఆ కుర్రాడిపై అక్కడున్న వార్డెన్‌కు డౌట్ వచ్చింది. 

ఏంటీ అంత పెద్ద లగేజీతో (Luggage) వస్తున్నావ్‌.. ఏముంది అందులో అంటూ హాస్టల్‌ వార్డెన్ ఆ అబ్బాయిని ప్రశ్నించాడు. ఏం లేదు అంకుల్.. ఆన్‌లైన్లో బుక్‌ ఆర్డర్ చేశాను వాటిని తీసుకొచ్చుకుంటున్నాను అని ఆ అబ్బాయి ఆన్సర్ ఇచ్చాడు. కానీ వార్డెన్‌ (Warden‌) మాత్రం ట్రాలీ బ్యాగ్‌ను ఓపెన్‌ చేయాలని పట్టుబట్టాడు. వద్దూ అంకుల్.. ఇందులో కొని పగిలిపోయే ఐటెమ్స్‌ కూడా ఉన్నాయి.. ఇక్కడ ఓపెన్ చేయాలేను అని తప్పుంకునేందుకు ఆ స్టూడెంట్ (Student) ప్రయత్నించాడు. 

అయినా కూడా వార్డెన్ వదల్లేదు.. బలవంతంగా ట్రాలీ బ్యాగ్‌ జిప్‌ ఓపెన్‌ చేయించాడు. వెంటనే అందులో నుంచి ఆ అబ్బాయి గర్ల్‌ ఫ్రెండ్‌ (Girlfriend) బయటకు వచ్చేసింది. 

షాక్‌కు గురైన వార్డెన్‌ గట్టిగా అడగడంతో అసలు విషయం బయటపడింది. హాస్టల్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌, తాను ఎంజాయ్ చేయాలనుకున్నామని ఆ అబ్బాయి చెప్పాడు. అయితే ఆ ఇద్దరు స్టూడెంట్స్‌ను కాలేజీ (College) నుంచి సస్పెండ్‌ చేశారని తెలుస్తోంది. 

కాగా ప్రస్తుతం ఇలాంటి ఇన్సిడెంట్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. అయితే ఈ వీడియోకు (Video) మణిపాల్‌ (Manipal) ఘటనకు సంబంధం లేదని తెలుస్తోంది.

Also Read: PL 2022 Auction: విరాట్ వైపు పరుగెత్తి.. నీకు ఏది అనిపిస్తే అది చెప్పు! చహల్‌కు సలహా ఇచ్చిన కోచ్!!

Also Read: Video: అచ్చు అల్లు అర్జున్‌ని దింపేసిందిగా.. ఆమె డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News