ఉత్తర కొరియాను పొగిడిన సీఎం

ఉత్తర కొరియా విషయంలో భారత్ మౌనవైఖరిని అవలంభిస్తున్నా... కేరళ మాత్రం ఈ విషయంపై స్పదించింది. 

Last Updated : Jan 4, 2018, 04:40 PM IST
ఉత్తర కొరియాను పొగిడిన సీఎం

ఉత్తర కొరియా విషయంలో భారత్ మౌనవైఖరిని అవలంభిస్తున్నా... కేరళ మాత్రం ఈ విషయంపై స్పదించింది. ఉత్తర కొరియాను ది గ్రేట్ అన్నట్టు పొగిడింది. ఆ మాటలను అనింది  ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్. 

వివరాల్లోకి వెళితే.. ఇటీవల కేరళ కోజికోడ్ లో జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పినారయి విజయన్ ఉత్తర కొరియాను పొగిడేశారు. ఉత్తర కొరియా అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా.. విజయవంతంగా తిప్పికొడుతోందని కితాబిచ్చారు. అమెరికా అజెండాను వ్యతిరేకించే విషయంలో విజయం సాధించిందని అన్నారు. 

అమెరికా, ఉత్తర కొరియా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతేడాది ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఉ.కొరియా 20కిపైగా క్షిపణి ప్రయోగాలు చేసింది. ఏక్షమైనా ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగే విధంగా.. న్యూక్లియర్ బాంబుతో దాడులుచేసుకొనే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా నూతన సంవత్సరం రోజు ఉత్తమ కొరియా టేబుల్ మీద బటన్ ఉందని.. అది నొక్కితే అమెరికా నాశనం అవుతుందని హెచ్చరించింది. దీనికి దీటుగా ట్రంప్ కూడా బదులిచ్చారు.

Trending News