Kerala: కొండచిలువ గుడ్లు పొదిగేందుకు 54 రోజులు హైవే పనులు నిలిపివేత

Viral News:  కొండచిలువ గుడ్ల వల్ల హైవే పనులు ఏకంగా  54 రోజుల నిలిచిపోయిన అరుదైన సంఘటన కేరళలో కాసర్​గోడ్​లో జరిగింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 06:33 PM IST
Kerala:  కొండచిలువ గుడ్లు పొదిగేందుకు 54 రోజులు హైవే పనులు నిలిపివేత

Kerala News:  కొండచిలువ గుడ్లను పొదిగేందుకు గానూ..జాతీయ రహదారి పనులను ఏకంగా 54 రోజుల పాటు నిలిపివేసింది ఉరాలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (ULCCS). ఈ ఘటన కేరళలోని కాసర్‌గోడ్‌లో (Kasargod) చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..
కాసర్‌గోడ్‌లో నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను ఉరాలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (ULCCS) చేపట్టింది. మార్చి 20న, NH 66 విస్తరణలో భాగంగా కల్వర్టును నిర్మిస్తున్న కార్మికులు, CPCRI సమీపంలోని ఎరియాల్ వద్ద ఒక బొరియలో కొండచిలువను గుర్తించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు ఫైథాన్ గుడ్లు పెడుతున్నట్లు గుర్తించారు. వెంటనే రహదారి పనులు ఆపాలని యూఎల్​సీసీను (Uralungal Labour Contract Co-operative Society Ltd)వారు కోరారు. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని యూఎల్​సీసీ నిర్ణయించింది.

Also Read: Woman Becomes Man: అమ్మ' ప్రేమంటే ఇదే మరి.. కూతురి కోసం 30 ఏళ్ల పాటు 'పురుషుని'గా మారింది! కారణం ఏంటంటే?

కొండచిలువలు.. వన్య ప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్​ 1 కిందకు వస్తాయి. వీటికి ఏదైనా హాని జరిగితే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ కొండచిలువ సంరక్షణ బాధ్యతలను  పాముల సంరక్షుడైన అమీన్​కు అప్పజెప్పారు అధికారులు. వాటిని అమీన్ 54 రోజులపాటు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. చివరకు మెుత్తం 24 గుడ్లు పొదగగా..ఆ పాము పిల్లలను అడవిలో విడిచిపెట్టారు అటవీశాఖ అధికారులు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News