Kolkata murder case cbi to conduct layered voice analysis test to accused: కోల్ కత్తాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో ఘటన దేశంలో పెనుదుమాంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఈ ఘటనను నిరసిస్తూ, విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆర్ కర్ ఆస్పత్రి చుట్టుపక్కల తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కోల్ కతా పోలీసులు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 విధించారు. గతంలో.. దీన్ని (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144)గా పిలిచేవారు. ఆదివారం నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ కీలక ఆదేశాలు జారీచేశారు.
సెక్షన్ 163 ప్రకారం.. ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు జరపరాదని, నిరసనలు తెలియజేయడం నేరం. అదే విధంగా.. ఐదుగురు లేదా అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్-2023లోని సెక్షన్ 163లోని సబ్ సెక్షన్ (1) కింద తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ ఈదేశాలు జారీ చేస్తున్నట్టు గోయల్ వెల్లడించారు.
ఈనెల 18వ తేదీ నుంచి, 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలుస్తోంది. అప్పటి పరిస్థితుల్నిబట్టి తాము.. ఆదేశాలు ఇస్తామని కూడా పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గత బుధవారంనాడు వందల మంది అల్లరిమూక నిరసనల ప్రాంతంలోనూ, ఆసుపత్రి క్యాంపస్‌లోనూ విధ్వంసానికి దిగడంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్టు..
జూనియర్ డాక్టర్ ను ఆగస్టు 9 న అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు బీహార్ కు చెందిన సంయ్ రాయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి ప్రస్తుతం లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తారని తెలుస్తోంది.ముఖ్యంగా.. సీబీఐ ఎల్ వి ఎ లేయర్డ్ వాయిస్ ఎనాలిసిస్ కోసంకోర్టు పర్మిషన్ ను ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. దీనికోసం..ఢిల్లీలోని సీఎఫ్ఎస్ఎల్ నుంచి ప్రత్యేకంగా సైకాలిజీస్టులను సీబీఐ రప్పించినట్లు తెలుస్తోంది. దీని తర్వాత నిందితుడికి పాల్ గ్రీఫ్ టెస్టులు సైతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా.. లేయర్డ్ వాయిస్ ఎనాలిసిస్, సీఎఫ్ఎస్ఎల్ టెస్టులలో.. నిందితుడి కదలకలు, భావోద్వేగం, అతని గొంతులో మార్పులు, ఫెషియల్ ఛెంజేస్ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తారు. అతను ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఈ టెస్టుల ద్వారా మాట్లాడిన మాటలను అధికారులు క్రాస్ చెక్ చేసుకుంటారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గతంలో ముంబైలో జరిగిన బర్గారీ త్యాగం కేసులో.. 2013 కేసులో శక్తిమిల్ అత్యాచారం కేసులో.. ముంబై పోలీసులు నిందితుడికి ఎల్ వీ ఎ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఈ టెస్టులో ముఖ్యంగా.. నిందితుడి శరీర కదలికలు, బాడీ లాంగ్వేజ్ లను అంచనావేసి.. అతను చెప్తున్న మాటల్ని నిపుణులు తెల్చేస్తారు. ఈ కేసులో.. అవసరమైతే.. నిందితుడిని గుజరాత్ లోని ఎన్ఎఫ్ఎస్ఎల్ మెయిన్ ఆఫీస్ కు కూడా తరలించేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి