Central home ministry on kolkata doctor rape and murder case: ట్రైయినీ డాక్టర్ హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఎక్కడ చూసిన డాక్టర్ లు, ప్రజలు, యువతికి న్యాయం చేయాలని..నిందితుడ్ని ఉరితీయాలంటూ కూడా డిమాండ్ లో చేస్తున్నారు. మరోపైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఘటనకు నిరసనగా ఒక రోజు దేశ వ్యాప్తంగా బంద్ ను పాటించింది. అంతేకాకుండా.. ప్రతిచోట కూడా జూనియర్ వైద్యులు తమ నిరసనలు తెలియశారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ఈ ఘటనపై ఏకంగా ప్రధాని మోదీకి లేఖను రాసింది.ఈ ఘటనలో కల్గజేసుకొవాలని కొరింది.
ఇదిలా ఉండగా.. దేశంలో వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యింది. అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర హోంశాఖకు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. కోల్ కతాలో ఆర్ జీ కర్ ఉదంతం తర్వాత శాంతి భద్రతల విషయంలో ఇంటెలిజెన్స్ నుంచి అలర్ట్ గా ఉండాలని రిపోర్టు రావడంతో.. వెంటనే రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతలపై తమకు సమాచారం ఇవ్వాలని కూడా హుకుం జారీ చేసింది.
ఇకమీదట, ప్రతి రెండు గంటల శాంతిభద్రతల నివేదికను మినిస్ట్రి ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ (న్యూఢిల్లీ)కి ఫ్యాక్స్, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలని కూడా MHA ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర పోలీసు బలగాలకు ఫ్యాక్స్, వాట్సాప్ నంబర్‌లు, రెండు గంటల పరిస్థితి నివేదికను పంపగల ఈమెయిల్ ఐడిని కూడా అందించింది.
దీనిపై కేంద్రం క్లారీటీ సైతం ఇచ్చింది. రాష్ట్ర/యుటి ప్రభుత్వాల నుండి శాంతిభద్రతల నివేదికలను కోరడం MHAకి కొత్త కాదని ఈ అభివృద్ధి గురించి తెలిసిన అధికారులు తెలిపారు. మరోవైపు ఆగస్టు 9న, కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ డ్యూటీలో ఉండగా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు.
ఈ ఘటనలో బీహర్ కు చెందిన ప్రధాన నిందితుడు..సంజయ్ రాయ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. 25 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తోపాటు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరికొందరిని సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి