Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..

Kolkata RG Kar Hospital: కోల్ కతాలోని ఆర్ జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 14, 2024, 07:42 PM IST
  • ట్రైయినీ డాక్టర్ పోస్ట్ మార్టంలో షాకింగ్ విషయాలు..
  • దేశ వ్యాప్తంగా మెడికోల నిరసనలు..
Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..

Kolkata Rg kar hospital Doctors murder case: జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యచార ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఆర్ జీ  కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ట్రైనీవైద్యురాలి పోస్టు మార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూనీయర్ వైద్యురాలి శరీరంలో.. దాదాపు.. 150 గ్రాముల వీర్యం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే.. ఇంతటి వీర్యం ఉండదని డాక్టర్లు తెలిపారు. వైద్యురాలిపై సాముహిక అత్యాచారం జరిగిందని కూడా వైద్యులు డాక్టర్ సుభర్ణ గోస్వామి  వెల్లడించారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. 

ఇదిలా ఉండగా.. సదరు జూనియర్ వైద్యురాలు.. ఆగస్టు 9 వ తేదీన సెమినార్ హాల్ లో నగ్నంగా.. పడి ఉండటంతో అక్కడున్న వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈఘటనలో పోలీసులు ఇప్పటికే బీహర్ కు చెందిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా మెడికోలు తమనిరసలను, ఆందోళనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో అధికారులు  ఘటనపై వైద్యులతో పోస్టు మార్టం రిపోర్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. 

నాలుగు పేజీల పోస్ట్ మార్టం నివేదిక..

ట్రైయినీ వైద్యురాలి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె థైరాయిడ్ భాగంలోని మృదులాస్థితి విరిగిపోయింది. అలాగే ఆమె మృతదేహంలోని ప్రైవేట్ భాగాల్లో సైతం గాయాలు స్పష్టంగా కనిపించాయి. అదే విధంగా పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై భాగంలో సైతం గాయాలయ్యాయి. ఆమె కళ్లతోపాటు నోటి నుంచి సైతం రక్తం కారిన విషయాన్ని ఈ నివేదికలో స్పష్టం చేశారు.

Read more: Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..  

లైంగిక దాడి జరిగినప్పుడు బిగ్గరగా అరవకుండా.. ఆమె నోటిని బట్టలు,చేతులతో గట్టిగా బిగించారు. దీంతో ఆమె ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అలాగే ఆమె తల భాగాన్ని గోడకు కొట్టినట్లుగా ఈ నివేదికలో స్పష్టమైంది. ముఖంపై గోర్ల గీతలు సైతం కనిపించాయి. లైంగిక దాడి చేసే క్రమంలో ఆమెను చిత్ర హింసలకు గురిచేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక సైతం స్పష్టం చేసింది.  దీనిపై తాజాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఈ ఘటన వల్ల దేశంలోని మెడికోల్లో అభద్రత భావం పెరుగుతుందన్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News