Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. నిన్న తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం..ఇవాళ తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి మరికొన్ని చోట్ల ఇలాంటి వాతావరణమే ఉండనుంది. ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలోనూ అల్పపీడనం ప్రభావం అధికంగానే ఉంది. కోస్తాంధ్ర తీరం వెంట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరం వెంట పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇటు రాయలసీమలోనూ చిరుజల్లులు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
The Depression over Northeast Arabian Sea weakened into a Well Marked Low Pressure Area at 0530 hours IST of today the 18th July, 2022 over central parts of north Arabian Sea. To weaken gradually into a Low Pressure Area and move towards Oman during next 24 hours. pic.twitter.com/l8MVhgWfp0
— India Meteorological Department (@Indiametdept) July 18, 2022
Also read:President Election LIVE*: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం..
Also read:MP Bus Accident: మధ్యప్రదేశ్‌లో విషాదం... నదిలో పడిన బస్సు.. 13 మంది మృతి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook