'డిజాష్ట్రస్ ప్రైమ్ మినిష్టర్' సినిమా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే టైటిల్‌తో ఎలాగైతే ఓ సినిమా వస్తుందో... అలాగే భవిష్యత్‌లో డిజాష్ట్రస్ ప్రైమ్ మినిష్టర్ అనే సినిమా కూడా వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. భవిష్యత్‌లో తప్పకుండా అటువంటి సినిమా ఒకటి వస్తుందన్న ఆమె... ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Updated: Jan 11, 2019, 06:35 PM IST
'డిజాష్ట్రస్ ప్రైమ్ మినిష్టర్' సినిమా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
SOURCE : ANI

కోల్‌కతా: యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ సినిమా గురించి స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే టైటిల్‌తో ఒక సినిమా ఎలాగైతే తెరకెక్కిందో.. అలాగే భవిష్యత్‌లో డిజాష్ట్రస్ ప్రైమ్ మినిష్టర్ అనే సినిమా కూడా వస్తుందని అన్నారామె. భవిష్యత్‌లో తప్పకుండా అటువంటి సినిమా ఒకటి వస్తుందన్న ఆమె.. ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించినట్టుగా వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

West Bengal CM Mamata Banerjee on Accidental Prime Minister movie