Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది.
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ ను కట్టడి చేయడం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏంటి ? కరోనా వైరస్ సోకిన రోగులకు ఎలా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏంటనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నేడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.
కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్‌ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి.
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తంచేస్తూ లాక్ డౌన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత కూడా కరోనావైరస్ కోవిడ్ హాట్ స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ (Coronavirus) శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 2,72,351 దాటగా.. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 11,310 దాటింది. కోవిడ్ (COVID-19) బారిన పడిన దేశాల్లో చైనాను ఇటలీ మించిపోయింది.
కరోనావైరస్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ ఎటాక్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కరోనావైరస్ (coronavirus)ని ఎదుర్కోవాలంటే.. ఎండలో 15 నిమిషాలు కూర్చుంటే చాలు వైరస్‌తో పోరాడేందుకు సరిపోయేంత వ్యాధి నిరోధక శక్తి (Immunity power) వస్తుంది.. దెబ్బకు కరోనావైరస్ పోతుంది అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబె (Ashwini Choubey).
కరోనావైరస్ (Coronavirus) లాంటి మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరిస్తున్నారు. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం ద్వారా కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతోనే అందరూ ఆ పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు చెబుతున్న మాట (Experts say on Coronavirus) అందుకు విరుద్ధంగా ఉంది.
కరోనావైరస్ (Coronavirus)ను మనిషే తయారు చేశాడా ? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్. చైనాలోని వుహాన్‌లో (Wuhan in china) కరోనావైరస్ పుట్టడమే ఈ సందేహాలకు కారణమైంది.
కరోనావైరస్ స్టేటస్ ఏంటి ? ఇప్పటివరకు కరోనా వైరస్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి ? ఇప్పటివరకు ఎన్ని పాజిటివ్ కేసులు బయటపడ్డాయి ? పూర్తి లేటెస్ట్ సమాచారం కోసం...
వేసవి వచ్చేస్తోంది కనుక మీరు ఫ్రిడ్జ్, ఏసి లాంటివి ఏమైనా కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే, మీరు త్వరపడాల్సిందేనేమో... లేదంటే వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ధరలు పెరిగే గృహోపకరణాల్లో ఏసి, ఫ్రిడ్జ్, టీవీతో పాటు ఇతర విద్యుత్ ఉపకరణాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.