Lok Sabha Election 2024 Dates Live: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే.. ఫలితాలు ఆ రోజే..

Lok Sabha Election 2024 Dates Announcement Live Updates: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 16, 2024, 04:26 PM IST
Lok Sabha Election 2024 Dates Live: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే.. ఫలితాలు ఆ రోజే..
Live Blog

Lok Sabha Election 2024 Dates Announcement Live Updates: దేశంలో నేడు ఎన్నికల నగరా మోగనుంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నకల సంఘం అనౌన్స్ చేయనుంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటించిన ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశాలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో షెడ్యూల్‌ను రూపొందించిన ఈసీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మూహుర్తం ఖరారు చేసింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల తేదీల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల డేట్స్ అనౌన్స్‌మెంట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 
 

16 March, 2024

  • 16:23 PM
  • 16:21 PM

    Lok Sabha Election 2024 date Live Updates: లోక్‌సభ ఎన్నికలు 2024 తేదీలు ఇలా..

    ==> దశ 1- ఏప్రిల్ 19 

    ==> దశ 2- ఏప్రిల్ 26 

    ==> దశ 3- మే 7

    ==> దశ 4 - మే 13

    ==> దశ 5 -మే 20 
     
    ==> దశ 6 - మే 25 

    ==> దశ 7 - జూన్ 1 

    ==> జూన్ 4న కౌంటింగ్

  • 16:14 PM

    Lok Sabha Election 2024 date Live Updates: యూపీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌ఘడ్, అస్సాం రాష్ట్రాల్లో మూడు దశలు, కర్నాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో, ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి.

  • 16:09 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు షెడ్యూల్ ఇలా..

    ==> నోటిఫికేషన్ ఏప్రిల్-18
    ==> నామినేషన్లకు తుది గడువు-ఏప్రిల్-25
    ==> నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ- ఏప్రిల్-29
    ==> నామినేషన్ల పరిశీలన- ఏప్రిల్-26
    ==> పోలింగ్ తేదీ- మే-13
    ==> కౌంటింగ్ తేదీ- జూన్-4

  • 16:07 PM

    Lok Sabha Election 2024 date Live Updates: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ఇలా..

    ==> నోటిఫికేషన్ ఏప్రిల్-18
    ==> నామినేషన్లకు తుది గడువు-ఏప్రిల్-25
    ==> నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ- ఏప్రిల్-29
    ==> నామినేషన్ల పరిశీలన- ఏప్రిల్-26
    ==> పోలింగ్ తేదీ- మే-13
    ==> కౌంటింగ్ తేదీ- జూన్-4

     

  • 16:03 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 20న నోటిఫికేషన్ రానుంది. 
     

  • 15:55 PM

    ==> ఏపీలో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు

    ==> ఎన్నికల నోటిఫికేషన్.. 18.4.24

    ==> నామినేషన్‌కు చివరి తేదీ... 25.4.23

    ==> పోలింగ్.. తేదీ.. 13.5.24

    ==> కౌంటింగ్..  4.6.24

  • 15:53 PM

    Lok Sabha Election 2024 date Live Updates: మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్..

    ==> జూన్ 4న ఎన్నికల కౌంటింగ్
     

  • 15:49 PM

    Lok Sabha Election 2024 date Live Updates: దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.
     

  • 15:44 PM

    Lok Sabha Election 2024 date Live Updates: 

    ==> పార్టీలకు అనుకూలంగా వార్తలు రాస్తే ప్రకటనలుగానే పరిగణిస్తాం..
    ==> భాష విషయంలో నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి..
    ==> స్టార్ క్యాంపెయినర్లు జాగ్రత్తలు పాటించాలి.
    ==> సోషల్ మీడియాలో ఫేక్ నివారణకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
    ==> సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై వెంటనే ఫ్యాక్ట్ చెక్ ఇస్తాం..

  • 15:38 PM

    Lok Sabha Election 2024 date Live Updates: దేశంలో సంవత్సరాల వారీగా ఓటర్ల వివరాలు

    ==> 1999: 62 కోట్ల మంది

    ==> 2004: 67cr

    ==> 2009: 72cr

    ==> 2014: 83cr

    ==> 2019: 91cr

    ==> 2024: 96.8cr

  • 15:34 PM

    Lok Sabha Election 2024 date Live Updates: 

    ==> ఇటీవల ఎన్నికల్లో రూ.3 వేల 400 కోట్లు జప్తు చేశాం
    ==> ఈడీ సహకారంలో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచాం.
    ==> బ్యాంకుల్లో నగదు ట్రాన్స్‌ఫర్స్‌పై నిఘా పెట్టాం..
    ==> ప్రలోభాలు, కానుకలు అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
    ==> ప్రైవేట్ విమనాలు, హెలికాఫ్టర్లలో కూడా తనిఖీలు

  • 15:31 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ఎన్నికలకు దూరంగా వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది
    ==> టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ-ఈసీ

  • 15:27 PM

    Lok Sabha Election 2024 date Live Updates:నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లలో ప్రకటన ఇవ్వాలి-ఈసీ
    ==> సీ విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం
    ==> ఏప్రిల్ 1వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో సవరణకు అవకాశం

  • 15:23 PM

    Lok Sabha Election 2024 date Live Updates: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ కల్పించింది ఈసీ. 

  • 15:19 PM

    Lok Sabha Election 2024 date Live Updates: దేశంలో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు-ఈసీ

    49.7 కోట్ల మంది పురుషులు, 47.1 మంది మహిళా ఓటర్లు-ఈసీ

  • 15:13 PM

    Lok Sabha Election 2024 Dates Live: దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. జూన్ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

  • 15:01 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ లైవ్‌లో చూడండి.

     

  • 15:00 PM

    Lok Sabha Election 2024 date Live Updates: లోక్‌సభ ఎన్నికలకు ముందు 'మై మోడీ కా పరివార్ హన్' పేరుతో ప్రధాని మోదీ ప్రచార గీతాన్ని విడుదల చేశారు.
     

  • 14:32 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీ వరకు సమయం ఉంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు మే నెలలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది.

  • 13:40 PM

    Lok Sabha Election 2024 date Live Updates: మరికాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
     

  • 13:23 PM

    Lok Sabha Election 2024 date Live Updates: ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఎలాంటి నిబంధనలు అమలు అవుతాయి..? రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు ఉండే నియమ, నిబంధనలు ఏంటి..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 13:17 PM

Trending News