కరోనా కేసుల బారీ పెరుగుదలకు సడలింపులే కారణమా?

దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో కరోనా కేసులు లక్షలు పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని,

Last Updated : May 19, 2020, 05:32 PM IST
కరోనా కేసుల బారీ పెరుగుదలకు సడలింపులే కారణమా?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో కరోనా కేసులు లక్ష పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని, సోమవారం సాయంత్ర 5 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను మిడ్ డే బులెటిన్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. ఉత్తరాఖండ్ లో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Also Read: విషాదాన్ని నింపిన ఈత సరదా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కాగా మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 2005 కేసులు నమోదవ్వడానికి కారణం లాక్ డౌన్ సడలింపులు కారణమని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1373 పాజిటివ్ కేసులు ఉండగా, అందులో 802 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 530 మంది డిశ్చార్జ్ అయ్యారని, 41 మంది మరణించారని కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. కర్ణాటకలో(lockdown guidelines) లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలకు అనుమతులివ్వడం, రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో సామాజిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News