Lok Sabha elections 2024: ఏప్రిల్ 16 నుంచే లోక్‌సభ ఎన్నికలా? వైరల్ అవుతున్న లేఖలో నిజమెంత?

Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 07:25 PM IST
Lok Sabha elections 2024: ఏప్రిల్ 16 నుంచే లోక్‌సభ ఎన్నికలా? వైరల్ అవుతున్న లేఖలో నిజమెంత?

Lok Sabha Polls Update: 2024 లోక్‌సభ ఎన్నికలు సంబంధించిన ఓ సర్క్యూలర్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఇందులో ఎన్నికల తేదీని ఏప్రిల్ 16గా పేర్కొన్నారు. ఈ లేఖ ఢిల్లీ సీఈవో కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాల ఎన్నికల అధికారులకు నోటిఫికేషన్ పంపించినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలవుతాయా? అనే చర్చ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే దీనిపై ఎక్స్ వేదికగా  ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ క్లారిటీ ఇచ్చారు. ఈ తేదీలు కేవలం రిఫరెన్స్ కోసమేనని స్పష్టం చేసింది. ఈ సర్క్యూలర్ పై పలు మీడియా సంస్థలు ప్రశ్నలు వేసినట్లు తెలిపింది. 

ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ సంప్రదాయాన్ని ఈసీ పాటిస్తూ వస్తుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ముందుగా ఒక రిఫరెన్స్ తేదీని పెట్టుకుని అందుకు అనుగుణంగా ముందస్తు కార్యకలాపాలను ఎన్నికల అధికారులు పూర్తి చేస్తారు. అయితే లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఏప్రిల్ లో మెుదలై.. మే లో ముగిసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 52 సీట్లకే పరిమితమైంది. 

Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. అంతేకాకుండా అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికలతోపాటు ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు కూడా నిర్వహించాలని యోచిస్తోంది. 

Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News