గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంపు, నేటి నుంచి అమలు

గత నెలలోనూ వంటగ్యాస్ ధరలు (Gas Cylinder Price) పెంచిన కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మరోసారి ఎల్పీజీ వంట సిలిండర్ ధరల(LPG Price Hike)ను పెంచేశాయి. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.4.5 వరకు పెరిగింది.

Last Updated : Jul 1, 2020, 12:31 PM IST
గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంపు, నేటి నుంచి అమలు

వంటగ్యాస్ సిలిండర్ (LPG Price) ధర పెరిగింది. తాజా ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. గత నెలలోనూ వంటగ్యాస్ ధరలు పెంచిన కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మరోసారి ఎల్పీజీ వంట సిలిండర్ ధరల(LPG Price Hike)ను పెంచేశాయి. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.4.5 వరకు పెరిగింది. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ 14.2 కేజీల సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..

ఎల్‌పీజీ ధరలు ఢిల్లీలో రూ.1 పెరగగా, ముంబైలో రూ.3.5, కోల్‌కతాలో రూ.4.5, చెన్నై, హైదరాబాద్‌లలో రూ.4 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో ఢిల్లీ, ముంబై నగరాలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.594కు చేరుకోగా, కోల్‌కతాలో రూ.620, హైదరాబాద్‌లో రూ.645, చెన్నైలో రూ.610 అయింది. Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

జూన్ నెలలో గ్యాస్ సిలిండర్‌పై రూ.11.50 మేర పెంచడం తెలిసిందే. తాజాగా జులైలోనూ మరోసారి ధరలు పెంచారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఓ కుటుంబానికి సబ్సిడీ కింద  14.2 కేజీల గ్యాస్ సిలిండర్లను గరిష్టంగా 12 అందిస్తుంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News